ఆధునికత మరియు సాంకేతికత తోడైన మహీంద్రా ట్రాక్టర్లకు తమిళనాడు రైతులు జై కొడుతున్నారు....
తమిళనాడు ప్రాంతం పచ్చని పొలాలకు,ఆహ్లదకరమైన వాతావరణకి పెట్టిందిపేరు. ఈ ప్రాంతంలో రైతుల తమ వ్యవసాయాన్ని మరింత సస్యశ్యామలంగా మార్చుకునేందుకు, మహీంద్రా అందిస్తున్న నూతన సాధనాలను అధునాతన ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మహీంద్రా భాగస్వామ్యంలో వ్య్వక్తిగతంగా మరియు సామూహికంగా అత్యధిక లాభాలు సొంతం చేసుకుంటున్నారు.
సాధారణంగా మన దేశంలోని ఎంతో మంది రైతులు అనేక వ్యవసాయ పనులకు కూలీలా మీద ఆధారపడుతున్నారు. తమిళనాడు ప్రాంతంలో వ్యవసాయ కూలీలా మీద ఆధారపడి రైతుల సంఖ్యా చాల ఎక్కువ. వ్యవసాయ అవసరాల కోసం సంప్రదాయ పద్దతుల మీద ఆధారపడటం ఎంతో ఖర్చుతో మరియు శ్రమతో కూడుకునిఉంటుంది. పైగా ఈ పద్దతుల ద్వారా పనులు పూర్తిచెయ్యడనికి చాల ఎక్కువ సమయం పడుతుంది. భారీగా పెరుగుతున్న జనాభా ఆహార అవసరాల కోసం వ్యవసాయాన్ని ఆధునీకరించడం ఎంతో కీలకం. మహీంద్రా అందిస్తున్న అధునాతన సాంకేతికత మరియు స్మార్ట్ సాధనాలతో తక్కువ ఖర్చు మరియు శ్రమతో మీ వ్యవసాయ సామర్ధ్యాన్ని మరియు లాభాలను పెంచుకోండి.
మహీంద్రా ట్రాక్టర్స్ సాయంతో తన వ్యవసాయాన్ని లాభాల బాటలో పయనింపచేస్తున్న విగ్నేష్ అనుభవం తెలుసుకోండి. తమిళనాడు, సేనంపాలయంకు చెందిన విగ్నేష్ , చాల ఏళ్ల నుండి కొబ్బరి సాగుచేస్తున్నారు. కొబ్బరిలో సమయానుకూలంగా ఎన్నో పద్దతులను ఆచరించాలి, విగ్నేష్ ఈ అవసరాల కోసం 30 సంవత్సరాల నుండి విగ్నేష్ కూలీలా మీద ఆధారపడుతూ వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో కూలీలా కొరత ఏర్పడటం, మారియు అందుబాటులో ఉన్న కూలీలా వేతనం అధికంగా ఉండటంతో మహీంద్రా మినీ ట్రాక్టర్ ఖరీదుచేసి అతని కొబ్బరితోటలో ఉపయోగిస్తున్నారు. సైజెలో చిన్నదైనా, పనితనంలో పెద్దదైన మహీంద్రా మినీ ట్రాక్టర్ తన వ్యవసాయ పనులన్నిటినీ సులభతరం చేసిందని, తక్కువ ఖర్చుతోనే అధిక లాభాలు పొందుతున్నట్లు విగ్నేష్ తెలిపారు.
తమిళనాడులోని రైతులు వైవిధ్యమైన పంటలను సాగుచేస్తారు. వాటిలో వరి, చెరుకు, అరటి, కొబ్బరి ప్రధానమైనవి. తమిళనాడు పూల సాగుకు పెట్టిందిపేరు. వివిధ పంట పెరుగుదలకు అనుకూలంగా మట్టిని దున్నడం, విత్తనాలు నాటడం, మందులు చల్లడం, కలుపుమొక్కలను నివారించడం, ఇలా అన్ని పనుల్లోనూ మహీంద్రా ట్రాక్టర్స్ తమదైన ప్రతిభ కనబరుస్తున్నాయి. తమిళనాడు, పెళ్లవలయం ప్రాంతానికి చెందిన ఆరటి రైతు, త్రిమూర్తి గత కొన్ని సంవత్సరాలుగా అరటి సాగులో, మహీంద్రా ట్రాక్టర్ వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ ఉపయోగిస్తున్నపటి నుండి కూలీలకు చెల్లించే మొత్తంలో మూడవ వంతు భాగంతోనే వ్యవసాయపనుల్లనీటిని పూర్తిచేసుకుంటున్నట్లు అయన తెలిపారు. తద్వారా ఖర్చులు తగ్గి డబ్బు ఆధా అవుతుందని తెలిపారు.
రైతుల యొక్క అన్ని వ్యవసాయ పనులను పూర్తిచెయ్యడంతో పాటు, ఈ ట్రాక్టర్ నడిపే రైతులకు కానీ ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతో సౌకర్యవంతంగా మహీంద్రా తమ ట్రాక్టర్లను రూపొందిస్తుంది. మహీంద్రా ట్రాక్టర్లు వినియోగించడం మొదలుపెట్టిన తర్వాత ఎంత ఎక్కువ సమయం పనిచేసినప్పటకి తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ శరీరంలో ఎటువంటి నొప్పులు లేవని విగ్నేష్ తెలిపారు.
తమిళనాడులోని రైతులు, మహీంద్రా ట్రాక్టర్లను అనేక వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తారు, మహీంద్రా కంపెనీ అందిస్తున్న రోటవేటర్ రైతాంగాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. వాటిలో ముఖ్యంగా పంట కోత కొయ్యడం, పొలంలోని మొక్కల అవశేషాలు తొలగించడం కోసం ఈ రోటావేటర్ వాడుతుంటారు. మెట్టుపాళ్యం కు చెందిన ధనరాజ్, ఇదివరకు తన పొలంలో పంట కోత కొయ్యడానికి మరియు పొలంలోని అవశేషాలు తొలగించడానికి దాదాపు 6000 రూపాయిల వరకు ఖర్చు చేసేవారు. మహీంద్రా రోటవేటర్ ఉపయోగం ప్రారంభించిననాటి నుండి ధనరాజ్ పొలంమొత్తం ఒక్కడే సాగుచేసుకుంటూ, ఈ కూలీలకు అయ్యే ఖర్చు మొత్తం పొదుపుచేసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ విధంగా తమిళనాడు ప్రాంతంలోని ఎంతోమంది రైతుల విభిన్న అవసరాలు తీరుస్తూ మహీంద్రా ట్రాక్టర్లు వారికి ఉత్తమ వ్యవసాయ భాగస్వామిగా తోడునిలుస్తున్నాయి.
Share your comments