"భారతీయ రైతుల అభ్యున్నతికి మహీంద్రా ట్రాక్టర్స్ నిరంతర కృషి"
మహీంద్రా ట్రాక్టర్లు ప్రారంభించి 60 వార్షికలు పూర్తిచేసుకున్న సందర్భంలో ఈ సంస్థ మరొక్క మైలురాయిని చేరుకుంది. 40 లక్షలకంటే ఎక్కువ మందికి తమ ఉత్పత్తుల ద్వారా సేవలు అందించి వారి మొఖంలో చిరునవ్వుకు కారణం అయ్యింది. ప్రారంభించిన నాటినుండి రైతుల అవసరాలకు తగ్గట్టు మహీంద్రా ట్రాక్టర్లు కొత్త రూపుదిద్దుకుంటూ వారికి అన్ని వ్యవసాయ పనుల్లో తోడుండి, రైతుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ తయారీ సంస్థగా మహీంద్రా కంపెనీ పేరుగాంచింది.
గత కొన్ని దశాబ్దాల నుండి వ్యవసాయా వినియోగ యాంత్రిక రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతూ, వ్యయసాయన్ని ఆధునీకరించడంలో ప్రధమ పాత్ర పోషించడం వలెనే నేడు మహీంద్రా ట్రాక్టర్లు ఈ ఘనత దక్కించుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహీంద్రా & మహీంద్రా, వ్యవసాయ పనిముట్ల తయారీ విభాగం ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా ఈ విధంగా ప్రస్తావించారు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రైతాంగాని అభివృద్ధి పదం వైపు నడిపేందుకు నిరంతరం కృషి చేస్తూ ఇప్పటివరకు 40 లక్షల యూనిట్ల ట్రాక్టర్లను విక్రయించామని అంతేకాకుండా ఇదే సంవత్సరం మహీంద్రా ట్రాక్టర్లు ప్రారంభించి ఆరు దశాబ్దాలు పూర్తిచేసుకున్నట్లు అయన తెలియచేసారు. ట్రాక్టర్లు విక్రయించడం ప్రారంభించి 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, ఈ విజయానికి కారకులైన రైతు సోదరులకు, డీలర్లకు తమ సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలియచేసారు.
మహీంద్రా & మహీంద్రా ట్రాక్టర్ల తయారీతో, 1963 లో మొట్టమొదటి సారి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు. సంస్థ ప్రారంభం అనంతరం మహీంద్రా B-275 మొదటి మోడల్ గా విదుదల చేసారు. అప్పటినుండి తమ ట్రాక్టర్లకు నూతన హంగులు దిద్దితు, వ్యవసాయ వినియోగానికి అనుకూలంగా ఎన్నో మోడల్స్ మార్కెట్లోకి తీసుకువచ్చారు. మహీంద్రా అంటే ఒక నమ్మకం అనే విధంగా రైతుల హృదయాల్లో చోటు సంపాదిస్తూ, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్ గా ఎదిగింది. ఇప్పటివరకు మహీంద్రా & మహీంద్రా కంపెనీ వారు సుమారు 390 ట్రాక్టర్ మోడల్స్ వినియోగంలోకి తీసుకువచ్చారు, అంతేకాకుండా భారత దేశవ్యాప్తంగా అత్యధిక డీలర్షిప్ కలిగిన సంస్థగా పేరొందించి. రైతులకు మహీంద్రా మీద ఉన్న నమ్మకం వాళ్ళ భారత దేశం మొత్తం 1200 పైగా డీలర్షిప్ నెటవర్క్స్ ఏర్పర్చడంలో ఆశ్చర్యం లేదు.
ఇప్పటివరకు మహీంద్రా అందుకున్న అత్యుత్తమ విజయాల్లో 2004 లో 10 లక్షల ట్రాక్టర్లు అమ్మడం, 2013 లో 20 లక్షల ట్రాక్టర్స్ విక్రయించడం, 2019 లో 30 లక్షల ట్రాక్టర్లు అమ్మకంజరపడం, మరియు ఈ సంవత్సరం 40 లక్షలు అమ్మకాలు జరపడం ముఖ్యమైనవి. మహీంద్రా ట్రాక్టర్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ వాఘ్ మాట్లాడుతూ, ఎప్పటినుండో రైతుల మన్ననలు పొందుతున్న, ఈ ఏడాది 40 లక్షల ట్రాక్టర్లు విక్రయించడం రైతుల్లో మహీంద్రా ట్రాక్టర్లకు ఉన్న ప్రత్యేకతను తెలియచేస్తుందని ప్రసంశించారు. రానున్న రోజుల్లో కూడా భారతీయ వ్యవసాయ పరిస్థితులను అర్ధం చేసుకుంటూ, వినియోగదారుల్లో నమ్మకం పెంచే విధంగా టాక్టర్స్ రూపొందిస్తామని తెలిపారు.
భారతీయ బ్రాండ్లకు విదేశాల్లో గుర్తింపు కలిపించేందుకు మహీంద్రా ప్రయత్నిస్తుంది. ఇందుకుగాను తమ ట్రాక్టర్లను ప్రపంచ మార్కెట్లలో విక్రయించడానికి సంసిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 50 దేశాల్లోని విదేశీ సంస్థలతో ఒప్పందం కుదర్చుకున్నట్లు సిఇఓ విక్రమ్ వాఘ్ తెలిపారు. ప్రస్తుతం మహీంద్రా ట్రాక్టర్లకు అమెరికాలో అతిపెద్ద మార్కెట్ ఉంది, ఈ విక్రయాలను యూరోప్ మరియు ఇతర దేశాలకు పెంచేందుకు మహీంద్రా పనిచేస్తున్నట్లు విక్రమ్ వాఘ్ ప్రస్తావించారు. అంతేకూండా గడిచిన ఐదు సంవత్సరాల నుండి మహీంద్రా ట్రాక్టర్స్ సేల్స్ అధికంగా ఉన్నట్లు దీనికరణంగా తక్కువ కాలంలోనే ఇన్ని లక్షల మందికి తమ కంపెనీ ట్రాక్టర్లు సేవలందిస్తున్నాయని అయన ఆనందం వ్య్వక్తం చేసారు. భవిష్యత్తులో కూడా ఇలాగే మెరుగైన సేవలు అందిస్తూ మరింత ఎక్కువ మంది వినియోగదారులను పొందుతామని ఆశాభావం వ్యక్తం చేసారు.
-
Read More:
-
ద్రాక్ష తోట నుండి అపారవిజయం
Share your comments