రోజురోజుకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడంతో వ్యవసాయంలో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ప్రతి చిన్న విషయం మనుషుల సహాయ సహకారాలతోనే చేసేవారు. అయితే ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని కొంతవరకు మనుషుల సహాయం లేకుండా కేవలం యంత్రాల ద్వారా మాత్రమే వ్యవసాయ పనులను కొనసాగిస్తున్నారు.
ఇక ప్రస్తుత కాలంలో ఎంతో పెద్ద చదువులు చదువుకున్న యువత సైతం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ విధంగా వ్యవసాయం చేసే వారి సంఖ్య అధికమవడంతో వారికి అనుకూలంగా వివిధ రకాల యంత్రాలు కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి యంత్రాలలో సరికొత్త యంత్రాన్ని హైదరాబాద్ కి చెందిన ఆశ్రిత్ అనే 9వ తరగతి విద్యార్థి రూపొందించాడు. అమెరికాలోని జార్జియాలో జన్మించిన ఆశ్రిత్ రోబో సహాయంతో పంటలు పండించే నమూనా ‘ఆటో ఫార్మ్’ను రూపొందించాడు.
ఈ విధంగా ఈ బాలుడు రూపొందించిన ఆటో ఫార్మ్ నమూనాకు ఇంటర్నేషనల్ యూత్ రోబో కాంపిటీషన్లో ప్రథమ బహుమతిని దక్కించుకున్నారు. ఈ నమూనాలో భాగంగా వ్యవసాయ పనులన్నింటిని రోబో చేస్తుంది. పొలం దున్నడం, విత్తనాలు చల్లడం, మొక్కలకు అవసరమైనప్పుడు నీటిని పెట్టడం వంటి పనులను రోబో నిర్వహిస్తుంది. తక్కువ ఖర్చుతో మానవ ప్రమేయం లేకుండా వ్యవసాయం చేయవచ్చని 9వ తరగతి విద్యార్థి నిరూపించాడు.
ఈ రోబో తయారు చేయడానికి అవసరమైన పరికరాలను తన ఉపాధ్యాయులు సహాయంతో ఈ నమూనాను తయారు చేశారని త్వరలోనే మరికొన్ని సరికొత్త ప్రయోగాలు కూడా చేస్తానని... ఈ విధమైనటువంటి ఆటో ఫార్మ్ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం వల్ల రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చని విద్యార్థి ఆశ్రిత్ తెలియజేశారు.
Share your comments