సాధారణంగా ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్నో కష్టాలను ఎలా ఎదుర్కోవాలి. పొలంలో విత్తనాలు నాటిన నుంచి పంటను కోసే వరకు పంటను రాత్రింబవళ్ళు సంరక్షించాలి ఉంటుంది.ఒక వైపు ప్రకృతి వైపరీత్యాలు పంట పై ప్రభావం చూపడమే కాకుండా మరోవైపు అడవి పందులు కూడా దాడి చేసి రైతులకు అధిక నష్టాలను తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది రైతులను పందుల బెడద నుంచి కాపాడటం కోసం విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోని రైతులు ఏమరపాటు వల్ల విద్యుత్ తీగలను తాకి ఎందరో రైతులు ప్రాణాలను కోల్పోయారు.
ఈ విధంగా రైతులకు ప్రమాదం లేకుండా అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవడానికి పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన కుందారం శ్రీనివాస్ అనే రైతు ఒక సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తన పొలంలో వేసిన పంటను అడవి పందుల నుంచి రక్షించడం కోసం రైతు శ్రీనివాస్ మరొక పంటను సాగు చేసి మంచి ఫలితాలను పొందుతున్నాడు.
లింగాల గ్రామ శివారులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. గత మూడు సంవత్సరాల నుంచి పత్తిని నాటగా అతనికి ఏమాత్రం ఆదాయం లభించలేదు. ఆ తరువాత మొక్కజొన్న పంటను వేయగా కరోనా ప్రభావం వల్ల పంటకు మంచి ధర లేకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాడు. దీంతో వ్యవసాయ అధికారుల సూచనలను తీసుకున్న శ్రీనివాస్ తన పొలంలో వేరుశనగ వేశాడు.అయితే అడవి పందుల బెడద నుంచి వేరుశనగను కాపాడటం కోసం తన పొలంలో ప్రొద్దుతిరుగుడు విత్తనాలను నాటాడు.
వేరుశనగ పంట కంటే ప్రొద్దుతిరుగుడు పంట అధిక ఘాటును కలిగి ఉంటుంది. ఈ ఘాటుకు పందులు పొలంలోకి ప్రవేశించవు.అదేవిధంగా ప్రొద్దుతిరుగుడు చెట్లు కొద్దిగా ముళ్ళు కలిగి ఉండటం వల్ల పందులు పొలంలోకి ప్రవేశించలేవని రైతు శ్రీనివాస్ తెలిపాడు. ఈ క్రమంలోనే వేరుశనగ పంటకు ముందుగా ఒక ఐదు వరుసలు ప్రొద్దుతిరుగుడు విత్తనాలను నాటడం వల్ల అడవి పందులు తన వేరుశనగ పొలంలోకి ప్రవేశించ లేదని తెలిపాడు. ఈ విధంగా కుసుమ పంట వేయటం వల్ల వేరుశనగ పంట అధిక దిగుబడి రావడంతోపాటు కుసుమ నూనె కూడా లభించడంతో అధిక ఆదాయాన్ని పొందుతున్నాడు. అడవి పందులను ఎదుర్కోవడంలో రైతు శ్రీనివాస్ విజయం సాధించడంతో మిగతా రైతులు కూడా ఇదే ఆలోచనను ఆచరణలో పెట్టారు.
Share your comments