ఎవరైనా డబ్బులు బాగా సంపాదించడానికి ఎంచేయాలి అనగ చాల మంది మంచి వ్యాపారం లేదా ఏదైనా పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగమైనా ఉండాలి అని భావిస్తారు. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో వ్యవసాయం చేసి కూడా లక్షలు కోట్లు సంపాదించవచ్చు అని రుజువు చేసాడు ఒక రైతు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతికి బిన్నంగా వ్యవసాయం చేస్తూ చాల మంది రైతులు అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఏవిధంగా అధిక లాభాలను పొందవచునో అలాంటి వ్యాపార సలహాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాలకు మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. అధేవిధం విదేశాల్లో కూడా మిరియాలకు ధర భారీగా పలుకుతుంది. నానాద్రో బి. మారక్ అనే మేఘాలయకు చెందిన ఒక రైతు మిరియాలను పండిస్తూ (బ్లాక్ పెప్పర్ ఫార్మింగ్ ) భారీగా ఆదాయాలను పొందుతున్నారు. ఈ రైతు మొత్తానికి మిరియాలను తన 5 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నాడు. భారత కేంద్ర ప్రభుత్వం ఆయన విజయాన్ని చూసి వారికీ పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
తన భూమిలో కరి ముండా రకానికి చెందిన మిరియాలను నానాద్రో బి. మారక్ పండిస్తున్నారు. పంటను పండించడానికి రసాయన ఎరువులు , క్రిమి సంహారక మందులను వాడకుండా సేంద్రియ (ఆర్గానిక్ ) ఎరువులను వాడుతున్నారు. మొదట 10 వేల మిరియాల మొక్కలను 10 వేలు ఖర్చు చేసి తన భూమిలో నాటారు. ఆ తర్వాత క్రమానుసారంగ పంటను విస్తరించారు.
ఇది కూడా చదవండి..
70 ఎకరాలు, 5 కోట్ల చెట్లు: ఏకంగా అడవినే సృష్టించిన సూర్యపేట వాసి -'దుశర్ల సత్యనారాయణ'
నానాద్రో బి. మారక్ ఇల్లు వెస్ట్ గారో హిల్స్ కొండలలో ఉంది. ఎవరైనాగాని ఈ ప్రాంతానికి వెళ్తే నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాల సువాసన వారికీ స్వాగతం పలుకుతుంది. ఈయన అక్కడ పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా మిరియాల సాగును గారో హిల్స్ కొండస్ ప్రాంతాలలో చేస్తున్నారు. వీరు పండించే మిరియాలు నాణ్యమైనవి కావడంతో వీరికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది.
మిరియాల సాగుకు రాష్ట్రవ్యవసాయ, ఉద్యానవనశాఖ పూర్తి సహకారం అందించారు. మారక్ మిరియా సాగులో విజయవంతమవడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా దీని పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇతర రైతులకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. పొలంలో 8-8 అడుగుల దూరంలో నల్ల మిరియాల మొక్కలను నాటాలి. రెండుమొక్కల మధ్య కనీసం అంత దూరం ఉంచడం చాల ముఖ్యం. ఎందుకనగా ఇవి మొక్కల పెరుగుదలపై ప్రభావితం చూపుతుంది.
ఇది కూడా చదవండి..
70 ఎకరాలు, 5 కోట్ల చెట్లు: ఏకంగా అడవినే సృష్టించిన సూర్యపేట వాసి -'దుశర్ల సత్యనారాయణ'
ఇంకా చెట్లనుండి మిరియాలను వేరుచేసే సమయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి. మిరియాల గింజలను కొంతసేపునీటిలో ముంచి ఆ తరువాత ఎండబెట్టాలి. ఈ విధంగా చేస్తే మిరియాలు మంచి రంగు అనేది వస్తుంది. కాస్త తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాంప్రదాయ పంటల కంటే ఎక్కువ రెట్ల లాభాన్ని పొందుతారని ఆయన తెలిపారు. 2019లో తన తోటలో రూ. 17 లక్షల విలువైన మిరియాలను ఉత్పత్తి చేసాడు.
నానాద్రో బి. మారక్ వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషి, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఆయన్ను అభినందించింది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించి దేశంలోని ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలిచినందుకు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మారక్‌కు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
ఇది కూడా చదవండి..
Share your comments