ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సహకారంతో ఆర్గానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ("ఆర్గానిక్ ఇండియా"), భారతీయ సినిమా 75 సంవత్సరాల వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగ అత్యుత్తమ రైతు అవార్డు ధరతి మిత్ర అవార్డు తో సత్కరించింది.
ఆర్గానిక్ ఇండియా 2017 లో 'ధరతి మిత్ర ' అవార్డులను స్థాపించింది, దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం లో రైతుల విజయాలను గుర్తించి ప్రోత్సహించడానికి, రసాయన ఎరువులు వినియోగించకుండా పంటలు సాగు చేసేవారికి ప్రోత్సాహకంగా, మరియు దేశ వ్యాప్తంగా రసాయన వినియోగం లేకుండా వ్యవసాయం చేయే రైతులకు ఒక్క వేదికను ఏర్పాటుచేసింది . 2017 లో ధరతి మిత్ర
అవార్డు గ్రహీత భరత్ భూషణ్ త్యాగికి 2019లో భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.
దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి లారా దత్తా మరియు కల్నల్ తుషార్ జోషి లు అవార్డులను అందచేశారు.
2022 ధరతి మిత్ర అవార్డు గ్రహీతలు :
- మొదటి బహుమతి :నాథాని ఉపేందర్ భాయ్ దయాభాయ్ -(గుజరాత్ )- 5 లక్షలు.
- రెండొవ బహుమతి : మల్లెషప్ప గులాప్ప - ( కర్ణాటక) -3 లక్షలు.
- మూడోవ బహుమతి : దేవరాడ్డి అగసనకొప్ప-( కర్ణాటక) 1 లక్ష
- నాల్గొవ బహుమతి రావల్ చంద్ - (రాజస్థాన్ )1లక్ష.
- ఐదవ బహుమతి ఉర్ రూబీ పరీక్ - (రాజస్థాన్ )1లక్ష
ఆర్గానిక్ ఇండియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రతా దత్తా ఈ వేడుకలో మాట్లాడుతూ, రైతుల అలుపెరగని కృషికి కృతజ్ఞతలు తెలిపారు, "పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ పై సమాజంలో మా రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత రైతులతో మా పరస్పర సంబంధాన్ని గౌరవించడానికి అవార్డులు ధరతి మిత్ర సృష్టించబడ్డాయి - వారి విశ్వాసాన్ని పెంపొందించడమే ఈ వేదిక ఒక ముఖ్య ఉద్దేశం గ అయన వెల్లడించారు .
ఆర్గానిక్ ఇండియా ఇప్పుడు దేశవ్యాప్తంగా 2,200 మంది రైతులతో కలిసి స్థిరమైన సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు చేతన జీవనాన్ని ప్రోత్సహించడానికి, అలాగే అనుకూలమైన ఆర్థిక, పర్యావరణ మరియు సామాజిక పర్యావరణ వ్యవస్థలను స్థాపించడానికి కృషి చేస్తోంది.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ అశోక్ యాదవ్ ఈ చొరవపట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, " రైతుల అద్భుతమైన కృషిని ఈ సందర్భంగా గౌరవించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడే వీరు నిజమైన హీరోలు అని అయన తెలిపారు .
ఆర్గానిక్ ఇండియా దేశవ్యాప్తంగా రైతుల నుండి 100 కు పైగా నామినేషన్లను అందుకుంది, అయితే దరఖాస్తులను క్షుణం గ పరిశీలించే ఇంటర్వ్యూ లను నిర్వహించే 5 గురిని ఎంపికచేసింది .
Share your comments