Success Story

శెభాష్ రైతన్న.. అడవి పందుల బెడదకు గొప్ప ఉపాయం

KJ Staff
KJ Staff

రైతులకు పంట వేసిన దగ్గర నుంచి అది చేతికి వచ్చేంత వరకు ఆందోళన. పంట వేసిన దగ్గర నుంచి చిన్నపిల్లవాడిని చూసుకున్నట్లు పంటను దగ్గరుండి చూసుకోవాలి. రాత్రి, పగలు అక్కడే ఉండాలి. ఇక సకాలంలో వర్షాలు పడకపోవడం, పంట కొతకు వచ్చే సమయంలో వర్షాలు పడటం వల్ల పంట నష్టపోవడం లాంటివి రైతులకు కన్నీళ్లను మిగిల్చుతున్నాయి.

ఇక పురుగుల బెడదతో పాటు అడవి పందుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. అడవి పందులు పోలాల్లోకి వచ్చి పంటను చెల్లాచెదురు చేస్తాయి. దీని నుంచి పంటను కాపాడేందుకు చాలామంది రైతులు పోలం చుట్టూ కరెంట్ తీగలు వేస్తూ ఉంటారు. అయితే దీని వల్ల మూగజీవాల ప్రాణాలతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది.

ఇాలాంటి తరుణంలో ఒక రైతు వినూత్నంగా ఆలోచించి ఒక గొప్ప ఉపాయం కనుక్కున్నాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన కుందారం శ్రీనివాస్ వినూత్నంగా ఆలోచించాడు. వేరుశెనగ పంటను ప్రస్తుతం శ్రీనివాస్ సాగు చేస్తుండగా.. పందుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఆ పంట చుట్టూ కుసుమ పంటను సాగు చేస్తున్నాడు

వేరుశెనగ పంట కంటే కుసుమ పంట వాసన చాలా ఘాటుగా ఉంటుంది. అంతేకాకుండా కుసుమ పంటకు సన్నని ముళ్లు ఉంటాయి. పందులు వచ్చినా అవి గుచ్చుకుంటాయని, దాని వల్ల పందుల బెడద తగ్గిందని రైతు చెబుతున్నారు. ఇక వాసన దెబ్బకు పందులు ఇటువైపు రావడం మానివేశాయని చెబుతున్నారు.

గత ఏడాది ఆ రైతు మొక్కజొన్న పంటను వేశాడు. కానీ పందుల వల్ల ఆ పంట పూర్తిగా నష్టాల పాలైంది. ఈ క్రమంలో వ్యవసాయ అధికారుల సూచనతో వినూత్నంగా ఆలోచించి ఇప్పుడు తన పాటను కాపాడుకుంటున్నారు. ఈ రైతు సూచనతో మిగతా రైతులు కూడా ఇలాంటి పద్దతిని పాటిస్తుున్నారు.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More