సాధారణ సాంప్రదాయ పంటలు పండించి అధిక లాభాలను పొందలేకపోతున్న రైతు, విసుగుచెంది వినూత్నంగా ఆలోచించాడు. వెల్లలో పెట్టుబడి పెట్టి, లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు ఒక రైతు. సాధారణ పంటలకు ప్రత్యామ్న్యాయ పంటలు ఎమున్నాయా అని అలోచించి ఆపిల్ బేర్ సాగును తన పొలంలో పండించడం ప్రారంభించాడు. ఈ ఆపిల్ బేర్ సాగు చేయడం వలన ఆ రైతు అధిక దిగుబడి మరియు అధిక లాభాలను పొందుతున్నాడు. ఈ విధమైన ప్రత్యామ్న్యాయ పంటలు పండించడానికి ఎక్కువ శ్రమ పడిన కూడా దానికి తగ్గ ఫలితం వస్తుంది.
తెలంగాణాలో నిజామాబాద్ జిల్లా, మంథని గ్రామానికి చెందిన చిన్నయ్య అనే రైతు తన పొలంలో కాశ్మీర్ ఆపిల్ బేర్ అనే ప్రత్యామ్న్యాయ పంటను, సంప్రదాయ పంట బదులుగా సాగు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే తనకున్న మొత్తం భూమిలో ఆపిల్ బేర్ పంట సాగు చేశాడు. ఈ ఆపిల్ బేర్ పంట సాగు కొరకు ఆ రైతు కలకత్తా నుంచి 750 మొక్కలను తన పొలంలో నాట్లు వేయడానికి తెప్పించాడు. ఆ మొక్కల మొత్తానికి అయ్యిన ఖర్చు 30 వేల రూపాయలు.
ఈ పంట సాగు చేయడానికి మొక్కల మధ్య దూరం అనేది 6, 12 మీటర్లు ఉండేలా ఒక ఎకరంలో ఈ మొక్కలను నాటారు. ఈ ఆపిల్ బేర్ పండ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ పండ్ల యొక్క ధర వచ్చేసి ఒక కిలోకి 100 రూపాయలు వరకు మార్కెట్లో ఉంది. ఈ ఆపిల్ బేర్ పండ్ల రుచి అద్భుతంగా మరియు నాణ్యత కూడా చాలా బాగుంది. ఇందువలన ఈ పాపండ్లకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది.
ఇది కూడా చదవండి..
మిల్లెట్ సాగుతో కోట్లలో టర్నోవర్ -రైతు కెవి రామ సుబ్బా రెడ్డి విజయకథ
ఈ ఆపిల్ బేర్ పంట బాగా పెరిగి డిసెంబర్ నెలలోనే కోతకు రావడం జరిగింది. ఈ పొలంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నారు. ఈ విధంగా నీరు అందించడం వలన పంటను చీడ పురుగులు ఆశించకుండా అరికట్టవచ్చు. సుమారుగా ఈ పంట సాగు కోసం 20 వేల రూపాయలు వరకు ఖర్చు చేసారు. ఇంచుమించుగా రెండు టన్నుల దిగుబడి, రెండు నెల్లల్లోనే వచ్చింది. దీని ద్వారా సుమారుగా ఆ రైతుకు 2 లక్షల ఆదాయం వచ్చింది. ఇది ఇలా ఉండగా ఇంకా మూడు టన్నుల దిగుబడి రానునట్లు అంచనా వేసినట్లు చిన్నయ్య తెలిపారు.
ఈ పంట విత్తనాలను కలకత్తా నుండి తెప్పించారు. ఒక్కో మొక్కకు 30 రూపాయలు మరియు అదనంగా 20 రూపాయలు మొక్కను పెట్టానికి ఖర్చు అయ్యింది అని ఆయన అన్నారు. ఈ పంట అనేది రోడ్ పక్కనే ఉండటం వలన రవాణా ఖర్చు మరియు శ్రమ కూడా తగ్గిందన్నారు. అంటారు పంటలుగా ఆపిల్ బేర్ తో, మిర్చి మరియు బంతి పూల మొక్కలను కూడా వేశారు. ఈ పంటకు వచ్చిన సమస్య ఏమిటంటే, మొక్కలకు ముళ్ళు ఉండటం వలన కోత సమయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ, సంప్రదాయ పంటల కంటే ఈ ప్రత్యామ్న్యాయ పంటలను పండించడం వలన అధిక లాభాలు వస్తున్నాయి అని అన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments