ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంది. మరి కొద్దీ సేపట్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చెయ్యనుంది. ఈ సమయంలోనే YSRCP ప్రభుత్వం తమ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఈ రోజు ఇడుపులపాయకు పర్యటనకు వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ సీఎం. జగన్ మోహన్ రెడ్డి, అక్కడ వై. ఎస్. ఆర్ సమాధికి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతల సమక్షంలో లోకసభ అభ్యర్థుల, జాబితాను విడుదల చేసారు. మొత్తం 25 MP పార్లమెంట్ స్థానాలకు, ఓసీలకు 09, బీసీలకు, 11, ఎస్సీలకు 4, మరియు ఎస్టీలకు ఒక్క స్థానాన్ని కేటాయించారు. అలాగే 175 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసారు.
టికెట్ల కేటాయింపులో మరోసారి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు, మొత్తం 59 మంది బీసీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. అలాగే బాలుగుబలహీన వర్గాలకు చెందినవారికి, 7 స్థానాలు కేటాయించారు మహిళల అభ్యున్నతిని తోడ్పాటును అందిస్తూ, 24 స్థానాలు మహిళలకు ఇచ్చారు.
అభ్యర్థుల్లో…
17 మంది డాక్టర్లు, 15 మంది లాయర్స్, 34 మంది ఇంజినీర్స్, 5 మంది టీచర్స్, ఇద్దరు సివిల్ సర్వెంట్స్, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒకరు జర్నలిస్ట్ ఉన్నారు.
Share your comments