ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదిని ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం గ జరుపుకోవడం జరుగుతుంది , దీనితో ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం జరుపుకోవడం నాల్గొవసారి , ప్రపంచ ఆరోగ్యానికి పప్పుధాన్యాల శక్తి గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును ఒక అవకాశంగా ఉపయోగిస్తారు
ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటాము? చరిత్ర మరియు ప్రాముఖ్యత
పప్పుధాన్యాలు పది వేల సంవత్సరాలుగా మానవ మరియు జంతు పోషణకు ప్రధాన వనరుగా ఉన్నందున వాటికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే, ఆకలి, పేదరికం, ఆహార కొరత ల ఫలితంగా, అందరికి సంపూర్ణ పోషకాహారం అందిచాలనపుడు పప్పు ధాన్యాల యొక్క ప్రస్తావన వస్తుంది .
ఆర్థిక, సామాజిక, పర్యావరణ అనిశ్చితి ని , దృష్టిలో పెట్టుకొని, ఫిబ్రవరి 10వ తేదీని పప్పుధాన్యాల అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించాలని, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగావాటి ఉత్పత్తి రేటును మళ్లీ రెట్టింపు చేస్తామని ప్రకటించారు
ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం 2022 యొక్క నినాదం ఏమిటి?
ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్స్ గా నియమించబడిన తరువాత, 2016 లో "స్థిరమైన భవిష్యత్తు కోసం పోషకాహార విత్తనాలు" అనే నినాదం ఎంచుకోబడింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం 2022 యొక్క సారాంశం , 'స్థిరమైన వ్యవసాయ-ఆహార వ్యవస్థలను సాధించడంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి రంగం లో యువతకు సాధికారత కల్పించడం .
పప్పు జాతి ధాన్యాలు సాదరంగా ఇతర జాతి వాటి తో పోలిస్తే అధికమొత్తం లో ప్రోటీన్ ను కలిగివుంటాయి ,పప్పుధాన్యాలుసాధారణంగా లెగుమ్ జాతికి చెందిన మొక్కలు ఉత్పత్తి చేస్తాయి. ఈ జాతి మొక్కలు వ్యవసాయ వ్యవస్థల వైవిధ్యతకు పునాదిగా పనిచేస్తాయి, ఇది మెరుగైన ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇవి వాతావరణం లో ని నత్రజనిని గ్రహించే లక్షణాలు కలిగి ఉండడం తో పటు భూమి యోక్క సారాన్ని పెంచడానికి దోహదపడతాయి . మట్టి పోషకాల వినియోగాన్ని సరళీకరణం చేయడానికి మరియు మెరుగైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడటం వల్ల పప్పుధాన్యాలు పందాలు స్థిరమైన వ్యవసాయానికి ఎంతో అవసరం.
Share your comments