ఈ ఏడాది పత్తి రైతుల బాధ ఎంత చెప్పుకున్న తక్కువే..పంట పండించిన రైతులలో ఏ రైతు అయినా బాధ పడుతున్నాడంటే అది కేవలం పత్తి రైతు మాత్రమే. పత్తి అమ్మడంలో దళారుల చేతిలో మోసపోతున్న పట్టించుకునే వారే లేరు. దళారులు చెపింది రేటు ఇచ్చిందే మద్దతు ధర అన్న చందనం గ మారింది రైతుల పరిస్థితి. గత కొన్ని రోజులగా పత్తికి మద్దతు ధర రైతులు పత్తి పంటను ఇంట్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు.
పత్తిని ఇంటి దగ్గర నిల్వ చేసిన రైతులకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంటిలో పతిని నిల్వ చేస్తున్న రైతులకు ఆరోగ్యం క్షీణిస్తోందని బాధపడుతున్నారు. ఆ రైతులకు చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయి అని వైద్యులు చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా కరీంనగర్ జిల్లాకు చెందిన వైద్యుల దగ్గరకు వందలాది మంది రైతులు మరియు వారి కుటుంబ సభ్యులు వెళ్తున్నారు. మార్కెట్ లో పతి ధర ఎలా ఉన్న వారి ఆరోగ్యం పాడవుతుందని రైతులు బాధపడుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి పత్తి పంట బాగా పండింది. పత్తికి మొదట్లో ధర బాగానే పలికిన తరువాతి దశల్లో మద్దతు ధర తగ్గిపోవడంతో జిల్లాలోని రైతులు పాందించిన పంటను ఇంటి వద్దనే నిల్వ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట కొనుగోళ్లు మొదలైనప్పుటి నుంచి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. కమీషన్ కోసం ఏజెంట్లు వారి ద్వారానే క్రమవిక్రయాలు జరపాలని డిమాండ్ చేస్తున్నారని రైతులు తెలిపారు.
ఇది కూడా చదవండి..
మహిళలకు శుభవార్త:రూ. 6000 అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం!
రైతులకు ఈ ఆరోగ్య సమస్యలు రావటానికి గల కారణం వచ్చేసి, పంటను పండించడానికి రైతులు ఎక్కువగా కృత్రిమ రసాయనాలను వాడటమే అని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పంటకు వాడిన ఈ రసాయనాలు పత్తిలో ఉన్నాయి. ఈ పత్తిని రైతులు ఇంట్లో నిల్వచేయడంతో వారికి ఈ సమస్యలు వస్తున్నాయి. దీనితో ఈ అలెర్జీల బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది అని వైద్యులు తెలుపుతున్నారు. రైతులకు ఈ పత్తి దూళిరేణువులతో అలర్జీ మరియు శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి.
కాబట్టి పత్తి రైతులు పత్తిని నిల్వ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే ఈ సమస్యల బారిన పడటం కచ్చితం అని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments