ఆంధ్ర ప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరదల ద్వారా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఫసల్ భీమా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు.
పర్యాటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు వరద నష్టం పరిశీలనకు వచ్చానని, రైతులు ఎవరు ఆ ధైర్య పడవద్దని , రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.వరదల వల్ల పంట మునిగిందని, అరటి, పసుపు, తమలపాకు, వరి. మినుము పంటలకు తీవ్ర నష్టం జరిగిందని , వరదలతో రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారని . మోదీ, చంద్రబాబులు కలిసి రైతులకు సహాయం అందిస్తున్నారని, పసల్ భీమ యోజన క్రింద ఆదుకుంటామని స్పష్టం చేశారు.
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి విజయవాడలో అయన పర్యటించారు ,ప్రజల్లోకి వెళ్లి వారి పరిస్థితిని శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
నేటి నుంచి వరద బాధితుల ఖాతాల్లో10 వేలు జమ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గురు , శుక్ర వారాలలో పర్యటించనున్నారు. ఏపీలో విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలోని రైతులతో కేంద్ర మంత్రి చర్చించనున్నారు. తర్వాత తెలంగాణలో ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు
నేటి నుంచి వరద బాధితుల ఖాతాల్లో10 వేలు జమ
Share your comments