News

MFOI అవార్డు లోగో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల !

Srikanth B
Srikanth B
MFOI '23అవార్డు లోగో ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న   కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
MFOI '23అవార్డు లోగో ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

ఢిల్లీ :వ్యవసాయ రంగంలో రైతుల విశేష కృషిని గుర్తించి వారికీ తగిన గుర్తింపును అందించాలనే లక్ష్యంతో ప్రముఖ వ్యవసాయ మీడియా కృషి జాగరణ్ MFOI (మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా) అవార్డును తీసుకొచ్చింది , దీనికి సంబందించిన లోగోను జులై 7 సాయంత్రం 7 గంటలకు అశోక్ హోటల్ న్యూ ఢిల్లీలోకేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఆవిష్కారించారు . ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పురుషొత్తరూపాలతో పాటు అశోక్ దల్వాయి CEO &NRAA ,ప్రో . రమేష్ చంద్ NITI ఆయోగ్ మెంబెర్ ,పద్మశ్రీ భారతభూషణ్ త్యాగి , డా. మోని మాడ స్వామి మాజీ DG NIC మరియు వ్యవసాయ రంగ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాత్రి 7 గంటలకు నుంచి 8 వరకు సాగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై చర్చలు జరిగాయి. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిధి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కృషి జాగరణ్ చేస్తున్న కృషిని కొనియాడారు . FTJ నుంచి మొదలుకొని అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఇప్పుడు దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు అవార్డులను అందించే MFOI (మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా) ను ప్రకటించడం తనకెంతో సంతోషం కల్గించిందన్నారు .

కృషి జాగరణ్ ఎడిటర్ చీఫ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కృషి చేసే రైతులను గుర్తించి ప్రోత్సహించడానికి ఎలాంటి అవార్డులు అవసరం అన్నారు.


MFOI అవార్డు ఏమిటి ?

MFOI (మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా) అవార్డులు కేవలం పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కాదు వ్యవసాయ రంగంలో శ్రమించే రైతులకు కూడా అవార్డులు అందించాలనే ఉద్దేశం తో కృషి జాగరణ్ MFOI (మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా) తీసుకొచ్చింది . సంవత్సరానికి 10 లక్షలు సంపాదించే యే రైతు అయినా క్రింద పేర్కొన్న వ్యవసాయ 26 రంగంలోని నామినేషన్ సమర్పించవచ్చు . వివిధ కేటగిరి లకు వచ్చిన నామినేషన్ లను పరిశీలించి జ్యూరి సంయులు అవార్డును ప్రకటిస్తారు.

2023-24 ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం ... ఏ పంటకు ఎంతో తెలుసా ?

MFOI అవార్డు లోగో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
MFOI అవార్డు లోగో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

అవార్డు కేటగిరి :


  • మిలియనీర్ హార్టికల్చర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • మిలియనీర్ ఫీల్డ్ క్రాప్స్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • మిలియనీర్ ఫ్లోరికల్చర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • మిలియనీర్ ప్లాంటేషన్ & సుగంధ ద్రవ్యాల రైతు ఆఫ్ ఇండియా
  • భారతదేశపు మిల్లియనీర్ పత్తి రైతు
  • మిలియనీర్ క్యాష్ క్రాప్స్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • భారతదేశంలోని మిలియనీర్ పాడి రైతు
  • భారతదేశం యొక్క మిలియనీర్ పౌల్ట్రీ రైతు
  • మిలియనీర్ యానిమల్ హస్బెండరీ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • మిలియనీర్ ట్రైబల్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • మిలియనీర్ ఆర్గానిక్ ఫార్మర్ ఆఫ్ ఇండియా

  • మిలియనీర్ FPO ఆఫ్ ది ఇయర్
  • మిల్లియనీర్ ఆల్ ఉమెన్ FPO ఆఫ్ ది ఇయర్
  • మిల్లియనీర్ కోఆపరేటివ్ ఆఫ్ ది ఇయర్
  • మిల్లియనీర్ మిల్లెట్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • భారతదేశపు మిలియనీర్ మహిళా రైతు
  • మిలియనీర్ ఫార్మర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా
  • భారతదేశం యొక్క మిలియనీర్ ఎగుమతి రైతు
  • మిలియనీర్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • మిలియనీర్ వెటివర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • మిలియనీర్ ఇన్నోవేటివ్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • మోస్ట్ స్టైలిష ఫార్మర్ ఆఫ్ ఇండియా (మహిళ)
  • మోస్ట్ స్టైలిష్ ఫార్మర్ ఆఫ్ ఇండియా (పురుషుడు)
  • భారతదేశంలోని కోటీశ్వరుడు ట్రాన్స్‌జెండర్ రైతు
  • ఐకానిక్ యూత్ ఫార్మర్ ఆఫ్ ఇండియా
  • లైఫ్‌టైమ్ అచీవర్ అవార్డు (మహిళ)
  • లైఫ్‌టైమ్ అచీవర్ అవార్డు (పురుషుడు)
  • 2023-24 ఖరీఫ్ పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం ... ఏ పంటకు ఎంతో తెలుసా ?

Related Topics

purushottham rupala

Share your comments

Subscribe Magazine

More on News

More