News

AGRICULTURE:వ్యవసాయ అభివృద్ధికై రెండు కొత్త పోర్టల్స్ ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి

S Vinay
S Vinay

కేంద్ర వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రి(Union Minister for Agriculture and Farmers’ Welfare) శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయానికి సంబంధించి ఈరోజు రెండు పోర్టల్‌లను ప్రారంభించారు.

శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించిన వ్యవసాయ పోర్టల్ లో ఒకటి పురుగుమందుల కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ (Computerized Registration of pesticide) మరొకటి ప్లాంట్ క్వారంటైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (Plant Quarantine Information System).

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రెండు పోర్టల్‌లు డిజిటల్ వ్యవసాయం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లడంలో దోహదపడతాయన్నారు. వ్యవసాయ ఎగుమతులు గొప్ప పురోగతిని సాధించాయని శ్రీ తోమర్ సంతోషం వ్యక్తం చేశారు.

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ (Department of Agriculture and Farmers Welfare) మరియు డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్ & స్టోరేజ్ (Directorate of Plant Protection, Quarantine & Storage) కలిసి భారతీయ పురుగుమందుల పరిశ్రమ లో ఎగుమతిదారులకి మరియు దిగుమతిదారులకు సేవలు అందిస్తోంది.

వ్యవసాయ ఉత్పత్తి మరియు పురుగుమందుల రిజిస్ట్రేషన్ ఎగుమతి/దిగుమతులకు సంబంధించిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడానికి మరియు ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ సిస్టమ్‌లో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ నేడు ఈ రెండు ఆన్‌లైన్ పోర్టల్‌లను ప్రారంభించింది.

ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు మరియు పత్రాల అప్‌లోడ్, ఆన్‌లైన్ అక్రిడిటేషన్ మరియు ట్రీట్‌మెంట్ ఏజెన్సీలు/సదుపాయాల పునరుద్ధరణ మరియు సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేయడంతో సహా వినియోగదారులకు సౌకర్యాన్ని అందిస్తుంది. అదేవిధంగా అభివృద్ధి చేయబడిన CROP పోర్టల్ వ్యాపారాన్ని సులభతరం చేయడంలో ఎంతో సహాయం చేస్తుంది మరియు దేశంలోని రైతులకు సకాలంలో పంట రక్షణ పరిష్కారాన్ని అందిస్తుంది.

మరిన్ని చదవండి.

వ్యవసాయ రంగంలో వనిత ప్రాముఖ్యత

Share your comments

Subscribe Magazine

More on News

More