News

కలవర పెడుతున్నహెచ్3ఎన్2 కొత్త వైరస్ లక్షణాలు ఇవే !

Srikanth B
Srikanth B

2019 సంవత్సరం నుంచి కొత్త కొత్త వైరస్ ల వ్యాప్తి ప్రజలను కలవర పెడుతున్నాయి ఇప్పుడిపుడే కరోనా వైరస్ కల్గించిన నష్టం నుంచి బయట పాడగున్న దేశానికి రోజు రోజుకు కొత్త వైరస్ ల వ్యాప్తి కలవర పరుస్తుంది . మారుతున్న వాతవరణం లో ఫిబ్రవరి చివరి వారం నుంచి హెచ్3ఎన్2(H3N2) ఇన్ ఫ్లూ ఎంజా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది ,ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఇద్దరు ,ముగ్గురు ప్రాణాలను కూడా కోల్పోయారు మారుతున్నా సీజన్ దృష్ట్యా మర్చి చివరి వరకు వైరస్ వ్యాప్తి చెంది తరువాత తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు .

 


హెచ్3ఎన్2 కొత్త వైరస్ లక్షణాలు :

నిరంతర దగ్గు, జ్వరం, విపరీతమైన గొంతునొప్పి, జలుబు, వికారం ప్రధాన లక్షణాలుగా వెల్లడించారు. సాధారణంగా సీజనల్ ఇన్ ఫ్లూ ఎంజా నాలుగు రకాలు. ఏ, బీ, సీ, డీ ఇలా 4 టైప్స్ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇన్ఫ్లూయెంజా ఏ , బీ వైరస్ లు వ్యాప్తి చెందుతాయి. అయితే ఈ వైరస్ సోకినవారు యాంటీబయాటిక్స్ ని వినియోగించవద్దని సూచిస్తున్నారు. అలాగే యుతులు సబ్బుతో, నీళ్లతో శుభ్రం చేసుకోవాలంటున్నారు మాస్కులు ధరించాలని, రద్దీ ప్రాంతాల్లో తిరగకూడదని.. తుమ్ము, దగ్గు వచ్చేటప్పుడు నోరు, ముక్కు చేతులతో కవర్ చేసుకోవాలని సూచిస్తున్నానరు. అస్తమానం కళ్ళను, ముక్కుని ముట్టుకోవడం తగ్గించాలని చెబుతున్నారు. ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలని. ఒంటి నొప్పులు, జ్వరం ఉంటే గనుక పారాసెటమాల్ మాత్ర వేసుకోవాలని చెబుతున్నారు.

ఏపీ రేషన్ కార్డు దారులకు ఉచితంగా రాగులు ,జొన్నలు..ఏప్రిల్‌ నుంచే అమలు!

అకస్మాత్తుగా జ్వరం, ఆపై జలుబు, దగ్గు, తలనొప్పి, వికారం, వాంతులు..దీర్ఘ కాలంగా వేధిస్తున్న దగ్గు మందులు వాడుతున్నా తగ్గని దగ్గు, జ్వరం మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోయినా, దగ్గు మాత్రం 10 నుంచి 15 రోజులు వేధించడం..అందరూ కరోనా మళ్లీ విజృంభిస్తుందని టెన్షన్ పడుతున్నారు. అయితే అది కరోనా కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న జ్వరాలకు హెచ్3ఎన్2(H3N2) ఇన్ ఫ్లూ ఎంజా వైరస్ కారణమని వివరిస్తున్నారు. అయితే దీని లక్షణాలు కూడా కరోనా వైరస్ ను పోలి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు .

ఏపీ రేషన్ కార్డు దారులకు ఉచితంగా రాగులు ,జొన్నలు..ఏప్రిల్‌ నుంచే అమలు!

Related Topics

new virus

Share your comments

Subscribe Magazine

More on News

More