News

రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. రుణాలు మాఫీ?

KJ Staff
KJ Staff

తెలంగాణ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వరాలపై వరాలను కురిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల హామీలలో భాగంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల హామీలలో భాగంగా 25 వేల రూపాయల వరకు పంటల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ సర్కార్ భావించినట్లు మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కరోనా కారణం చేత ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో వెల్లడించారు.ఈ క్రమంలోనే మంత్రివర్గం తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని ఆదేశించారు.

ఈనెల 15 నుంచి నెలాఖరులోగా తీసుకున్న పంట రుణాలు ఎవరైతే 50 వేలలోపు ఉంటాయో వారందరినీ మాఫీ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కేసీఆర్ తీసుకున్న గత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది రైతుల వరుకు లబ్ధి పొందనున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 9 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.

ఈ మంత్రి వర్గ సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలను తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువగా ఉన్న అగ్రకుల పేదలకు విద్య ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటను కల్పించాలని, ఈ కోటాలో భాగంగా భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ట వయస్సు ఐదు సంవత్సరాలకు పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ సర్కార్ ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు తదితర పథకాల ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చింది. ఇక 50 వేలలోపు రుణమాఫీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

Share your comments

Subscribe Magazine

More on News

More