News

నల్ల బియ్యం సాగుతో రైతుల కష్టాలు దూరం.. అధిక లాభం పక్కా..

KJ Staff
KJ Staff

పూర్వం వ్యవసాయం అనేది చదువు రాని వారు మాత్రమే చేస్తారని ఒకపుడు మాటలు వినిపించేవి. ఒకపుడు కడుపు నింపుకునేందుకే కేవలం పంటలు పండించేవారు. వారి అవసరాల కోసమే తమ పొలంలో పంటలు పండించుకుని ఆకలి తీర్చుకునేవారు. కానీ ఇప్పుడు ఇలా కాదు, కాలం మారింది. వారు వీరు అని తేడా లేకుండా ఐటీ ఉద్యోగి నుండి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ప్రతిఒక్కరు వయ్వసాయ బాటలో నడుస్తున్నారు. తమ ఉద్యోగాలను సైతం రాజీనామా చేసి వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. సంప్రదాయ పంటలే కాకుండా వాణిజ్య పంటలను కూడా పండించి విదేశాలకు ఎగుమతి చేసి లక్షలు సంపాదిస్తున్నారు.

మీకు మీరు చేసే ఉద్యోగం బోర్ కొడితే, మీ శోథ ఊర్లకు వెళ్లి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉందా ? ఐతే అద్భుతమైన ఈ బిజినెస్ సలహాను అనుసరించండి. ఈ కాలంలో బ్లాక్ రిసెను డిమాండ్ బాగా పెరిగి, మార్కెట్ లో మంచి ధర పలుకుతుంది. ఈ నల్ల బియ్యం పంటను పండించి భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నల్ల బియ్యంలో పోషకాలు మనం తినే సాధారణ బియ్యంతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. నల్ల బియ్యంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

అందువలన ఈ నల్ల బియ్యం తినేవారిలో డయాబెటిస్, బి.పి వంటి వ్యాధులపై ప్రభావంతంగా పనిచేస్తుంది. ఓ బియ్యం తింటే షుగర్, బి.పి వంటి రోగాలు అదుపులో ఉంటాయి. చాల మంది రేటు కొంచెం ఎక్కువ అయినా కూడా ఈ నల్ల బియ్యంను తినేందుకే మొగ్గుచిఉపుతున్నారు.

ఇది కూడా చదవండి..

మదనపల్లెలో కాశ్మిరీ కుంకుమపువ్వు సాగు ..

చైనాలో ఎక్కువగా ఈ రకం బియ్యాన్ని మొదట పండించేవారు. తర్వాత ఈ బియ్యంలో ఆరోగ్యానికి చాల బాగా ఉపయోగపడుతుందని ఇతర ప్రాంతాల్లో కూడా పండించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఈ నల్ల బియ్యం సాగు సిక్కిం, అసొం, మణిపూర్ రాష్ట్రాలలో అధికంగా ఉంది. ఇప్పుడిడుపు ఇతర రాష్ట్రాలలో కూడా సాగు మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన కొందరు రైతులు ఈ నల్ల బియ్యం సాగు చేస్తున్నారు. ఈ బియ్యంను ఉత్తరాదిలో నీలా భాట్ అనికూడా పిలుస్తారు ఎందుకనగా ఈ బియ్యం చూడటానికి నల్లగా ఉన్నా వండిన తర్వాత మిలన్ రంగులోకి మారుతుంది.

నల్ల బియ్యం పంట కాలం 4 నెలలు అనగా దాదాపు 100 నుండి 120 రోజుల సహాయం పడుతుంది. నల్ల బియ్యం సాంప్రదాయ బియ్యం కంటే 5 రేట్లు అధిక లాభాన్ని ఇస్తుంది. మార్కెట్లో సాధారణ బియ్యం ధర కిలో రూ.50-100 వరకు ఉంటె నల్ల బియ్యం రేటు రూ.250- 500 వరకు ఉంటుంది. నల్ల బియ్యం తింటే గుండె సంబంధిత రోగాలు మరియు క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. ఈ బియ్యంలో అధిక ప్రోటీన్స్ ఉంటాయి. సాధారణంగా 10 గ్రాముల నల్ల బియ్యం నుండి 9 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇందీవల్ల ఈ నల్ల బియంకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది.

ఇది కూడా చదవండి..

మదనపల్లెలో కాశ్మిరీ కుంకుమపువ్వు సాగు ..

Share your comments

Subscribe Magazine

More on News

More