ఉల్లిపాయలు అనేక వంటలలో ముఖ్యమైన పదార్ధం, ఇది మన రోజువారీ జీవితంలో అంతర్భాగంగా ఉంటుంది. మనం నిత్యం ఆహారపదార్థాల్లో ఉపయోగించే వాటిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పానీపూరి దగ్గర నుంచి చాలా మందికి ఇష్టమైన మసాలా కూరల వరకు ప్రతి దాంట్లో మనకు ఈ ఉల్లిపాయలు వాడాల్సిందే.
అయితే సాధారణంగా, సగటు ఉల్లిపాయ బరువు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా, ఉల్లిపాయలు 100 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి మరియు మహాఅయితే, అవి అర కిలోగ్రాము బరువు వరకు ఉంటాయి. అరకేజీ అంటేనే మనకు నమ్మశక్యంగా లేదు.. అలాంటిది ఏకంగా ఒక రైతు 9 కేజీల బరువు ఉన్న ఉల్లిపాయను పండించాడు. ఈ ఉల్లిగడ్డ ఏకంగా రికార్డును సృష్టించాడు.
యూనిటైడ్ కింగ్ డమ్ లోని గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన గారెత్ గ్రిఫిన్ అనే ఒక రైతు ఎన్నో సంవత్సరాలుగా పంటలు పండిస్తున్నాడు. అతను అసాధారణమైనదాన్ని సాధించాలనే కోరికను కలిగి ఉన్నాడు. ఈ రైతు ఉల్లిపాయను పండించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టిధం అనుకున్నాడు. 12 ఏళ్లు కష్టపడి ఎట్టకేలకు ఇటీవల ఓ భారీ ఉల్లిపాయను పండించాడు. ఆ ఉల్లిపాయ బరువు సుమారుగా 8.9 కిలోలు ఉంది. ఇక దాని పొడవు విషయానికి వస్తే 21 అంగుళాలు ఉంటుంది. దీనిని ఆయన ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో ప్రదర్శించారు.
ఇది కూడా చదవండి..
నేటితో ముగియనున్న ఓటర్ నమోదు గడువు.. ఎన్ని అప్లికేషన్లు అంటే?
ఆరోగేట్ పండించిన ఈ ఉల్లిపాయ ప్రపంచ రికార్డు సృష్టించిందని ఆటమ్ ఫ్లవర్ షో తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రకటించింది. అయినప్పటికీ, ఈ విషయాన్నీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా అధికారికంగా గుర్తించలేదు. కాగా, గారెత్ గ్రిఫిన్ ఈ పనిని సాధించడానికి ఎంతగానో కష్టపడినట్లు తెలిపాడు. తన తండ్రి కూడా పెద్ద సైజు ఉల్లిగడ్డలను సాగు చేసేవారని చెబుతున్న గారెత్ తాను కూడా ఓ పెద్ద ఉల్లిగడ్డను సాగుచేసి రికార్డు క్రియేట్ చేయాలని తపన పడ్డానని చెబుతున్నారు.
ఈ పెద్ద ఉల్లిపాయను పండించడానికి, అతను అదనపు లైటింగ్ మరియు స్వయంచాలక నీటిపారుదల వంటి ప్రత్యేక సాంకేతికతలను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను తెలిపాడు. సరైన విత్తనాలను ఎంచుకోవడం మరియు ఖచ్చితమైన సాగు పద్ధతులను పాటించడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపాడు. ఈ ఉల్లిపాయ సాధారణ ఉల్లిపాయ మాదిరిగానే ఉంటుందని కానీ కొంచెం రుచి తక్కువగా ఉంటుందని తెలిపాడు.
ఇది కూడా చదవండి..
Share your comments