రైతులు పంటలను పండించడానికి అనేక కష్టాలు పడుతున్నాడు. వాతావరణ పరిస్థితులు సహకరించక, అలా పండించిన పంటకు మార్కెట్ ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆరుగాలం కస్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్తున్న రైతులపై అక్కడి అధికారులు హమాలీ ఖర్చులు అంటూ రైతులపై అదనపు భారాన్ని మోపుతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ కొనుగోలు క్రీంద్రాలో అధికారులు ఈ నెల 12వ తేదీ నుండి ధాన్యాన్ని కొనడం ప్రారంభించారు అధికారులు. జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ధాన్యం కేంద్రాలకు రైతుల ధాన్యం తీసుకెళ్లి కుప్పలుగా పోసుకున్నారు. ఇకపోతే అధికారులు హమాలీ చార్జీలను రైతులే భరించాలి అని రైతులకు చెబుతున్నారు.
గతంలో ఈ హమాలీ చార్జీలను ప్రభుత్వమే పెట్టుకునేది. ప్రభుత్వం గతంలో క్వింటాకు రూ.5.30ల చెల్లించేది. దీనితో రైతులకు అదనపు భారం తగ్గేది. కానీ 2015 నుండి హమాలీ చార్జీలను ప్రభుత్వం చెల్లించకుండా ఆ భారాన్ని ప్రభుత్వం రైతులపైనే మోపుతోంది. దీనితో రైతులు అదేజిక లాభాలను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఈ హమాలీ చార్జీలను బాగా పెంచింది. రైతులు అకాల వర్షాల కారణంగా నష్టపోవడంతో బాధపడుతున్నారు.
ఇది కూడా చదవండి..
రైతులకు తీరని కస్టాలు.. కిలో టమాటా రూ.5
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాను తూకం వేయడంతో పాటు లారీల్లోకి ఎత్తడానికి రూ.15 చొప్పున క్వింటాకు రైతు హమాలీలకు రూ.40, తాలు వేరు చేసేందుకు (సుతినికి) మరో రూ.10తో కలుపుకొని మొత్తం రూ.50 వరకు చెల్లించాల్సి రావడంతో రైతులపై భారం తప్పడం లేదు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని యంత్రాంగం నిర్ణయించింది. అధికారులు కొనాలకున్న ధాన్యం ప్రకారంగా రైతులపై హమాలీ భారం సుమారు రూ.40కోట్లు పడనుంది.
ఇది కూడా చదవండి..
Share your comments