తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో సన్న రకం వరి వంగడాలు పండించే రైతులకు బోనస్ అందిస్తామన్న విష్యం తెలిసిందే. దీనికి సంభందిచిన సన్న రకం వరి వంగడాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణల కమిటీ కసరత్తు చేసి ఎంపిక చేసిన సన్నరకాల జాబితాను బుధవారం విడుదల చేసారు. ఈ జాబితాలోని వరి వంగడాలను సాగుచేసి ప్రభుత్వం యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వారికి ఈ రూ.500 బోనస్ లభిస్తుంది.
మరోపక్క కేంద్రం ప్రభుత్వం 2024-25 పంట కాలానికి, వ్యవసాయ ఉత్పత్తులకు అందించే కనీస మద్దతు ధరలను ప్రకటించింది. ఈ ఏడాది వరి సాధారణ రకానికి క్వింటాల్ రూ. 2300 మరియు ఏ- గ్రేడ్ రకానికి రూ.2,320 ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం అదనంగా అందిస్తున్న బోనస్ తో కలుపుకొని మొత్తం రూ. 2800 రైతులకు గిట్టుబాటు ధర లభించనుంది. అయితే ప్రభుత్వం సూచించిన సన్న రకం వడ్లను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ బోనస్ లభిస్తుంది.
రైతులకు ఈ బోనస్ మీద ఎన్నో సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో దొడ్డు రకాలు కూడా సన్నలుగా చలామణి అవుతున్నాయి. ఎటువంటి వడ్ల రకాలకు బోనస్ ఇస్తారన్న సందేహం రైతులకు ఉంది. ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణల కమిటీ సన్నరకం వడ్ల జాబితాను విడుదల చేసింది. సన్నలో 40 పబ్లిక్ వెరైటీలతో పాటు మరికొన్ని ప్రైవేట్ రకం వంగడాలను కూడా ఈ జాబితాలో చేర్చారు.
కమిటీ రూపొందించిన జాబితలోని రకాలు ఈ విధంగా ఉన్నాయి, ఆర్‌ఎన్‌ఆర్-15048(తెలంగాణ సోనా), కేఎన్‌ఎం-1638, జేజీఎల్-1798, వరంగల్-962, జేజీఎల్-3844, జేజీఎల్-11118, కేఎన్‌ఎం-733, వరంగల్-1119, ఆర్‌ఎన్‌ఆర్-21278, జీజీఎల్-17004, వరంగల్-44, బీపీటీ-5204, జేజీఎల్-11470, జేజీఎల్-384, జేజీఎల్-3828, జేజీఎల్-3855, జేజీఎల్-11727, వరంగల్-347, వరంగల్-14, వరంగల్-32100, ఆర్‌ఎన్‌ఆర్-2458, కేపీఎస్-2874, ఆర్‌ఎన్‌ఆర్-2354, ఆర్‌ఎన్‌ఆర్-2465, వరంగల్-697, జేజీఎల్-28545, జేజీఎల్-27356, హెచ్‌ఎంటీ సోనా, బీపీటీ-2595, బీపీటీ-5204, ఎంటీయూ-1064, ఎంటీయూ-1121, ఎంటీయూ-1224, ఎంటీయూ-1262, ఎంటీయూ-1271, ఎంటీయూ-1282, ఎన్‌డీఎల్‌ఆర్-7, ఎన్‌ఎల్‌ఆర్-34449. వీటితో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు విక్రయిస్తున్న వరి వంగడాలను కూడా ఈ జాబితాలో చేర్చారు.
తెలంగాలోని వేర్వేరు ప్రాంతాల్లో రైతులు, ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు విక్రయించే వరి వంగడాలు వినియోగిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాను సిద్ధం చేసారు. ఇందుకోసం ఆచార్య జయశంకర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, రాష్ట్ర వ్యవసాయ పౌరసరఫరా శాఖ అధికారులు, ఆదర్శ రైతులతో కమిటీ వేసి వారి సూచనలకు అనుగుణంగా తుది జాబితా ప్రకటించడం జరిగింది. ఈ సన్నల జాబితాలో గింజ పరిమాణం 6 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉంది గింజ పొడవు మరియు వెడల్పు నిష్పత్తి 2.5% కంటే ఎక్కువ ఉన్న రకాలను ఎంపిక చేసారు.
Share your comments