News

Crop loss:మళ్లీ పంటను ముంచెత్తిన వానలు... నష్టాల్లో తెలంగాణ రైతులు!

KJ Staff
KJ Staff

హైదరాబాద్: కొన్ని వారాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల రైతులు వరుసగా రెండోసారి అకాల వర్షాల దుష్పరిణామాలను ఎదుర్కొన్నారు. వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, తదితర ప్రాంతాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యమవడంతో వర్షాలు కురిసి పంటలు నీటమునిగిపోతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ యార్డులకు, కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే ,అకాల వర్షాలకు నిల్వ ఉంచిన పంట గుబులు నాశనమవ్వడం జరిగిందని , ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతోందని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిని సొమ్ము చేస్కోడానికి , మిల్లర్లు బేరం కుదుర్చుకుని వరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయగలుగుతున్నారు.దీంతో రైతుల కష్టాలు మరింతగా దిగజారాయి.

చొప్పదండిలోని కొనుగోలు కేంద్రానికి తండ్రితో పాటు వెళ్లిన వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మొదట్లో అకాల వర్షాల కారణంగా నిలిచిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రానికి పంటను తెచ్చినా అమ్మేలోపే వానలకు తడిసిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుండి నిల్వలను కవర్ చేయడానికి మరియు రక్షించడానికి అవసరమైన కనీస సౌకర్యాలు లేవని ఆయన అన్నారు.

ఇవి కుడా చదవండి

రైతులకు శుభవార్త: మే 10 కల్లా రైతు భరోసా డబ్బులు ఇవ్వనున్న జగన్

 

సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వచ్చే 24 గంటల్లోపు కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న వరి నిల్వలు అకాల వర్షాలకు గురికాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. వాతావరణ సూచన మేరకు రానున్న కొద్దిరోజుల పాటు వడగాల్పులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అకాల వర్షాల నుంచి వరిపంటను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా కలెక్టర్లను సదస్సు సందర్భంగా ఆదేశించారు. మే 1వ తేదీలోపు కురిసిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై నివేదికలు అందజేయాలని, ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి పంట నష్టం వివరాలను సేకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన పంట నష్టపరిహారాన్ని కూడా తప్పకుండ అందజేస్తామని ఆమె ప్రకటించారు.

ఇవి కుడా చదవండి

రైతులకు శుభవార్త: మే 10 కల్లా రైతు భరోసా డబ్బులు ఇవ్వనున్న జగన్

image credits: the Indian express, premium times

 

Share your comments

Subscribe Magazine

More on News

More