జిల్లాలో వరి ధాన్యం సేకరణ పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ రూపొందించడానికి మంత్రులు, ఉన్నతాధికారులతో తక్షణమే సమావేశం నిర్వహించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించి , వాటిని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రతిరోజూ కనీసం నాలుగు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి సమీక్షించాలని
ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో గోనె సంచుల సేకరణపై దృష్టి సారించాలని, వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలను వరి ధాన్యం సేకరణకు పూర్తిగా వినియోగించుకోవాలని, రైతులకు క్వింటాలుకు రూ.1960గా కనీస మద్దతు ధర పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు .
Share your comments