రుణమాఫీ కానీ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే దాదాపు యాభై శాతం వరకు పూర్తి కవస్తున్నట్లు సమాచారం, ఆగస్టు నెలలో 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కొన్ని కారణాలతో కొంత మందికి రుణమాఫీ జరగలేదు దీని కోసం ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ సర్వే నిర్వహిస్తుంది.
వివరాలు సరిగ్గా లేకపోవడం తో దాదాపు 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఆగినట్లు సమాచారం, బ్యాంకర్లు ఇచ్చిన డేటాతో ఆయా అకౌంట్లకు సంబంధించిన రైతు కుటుంబాలను గుర్తించేందుకు సర్వే మొదలు పెట్టింది. గ్రామాల వారీగా రుణమాఫీ కావాల్సిన రైతుల లిస్టు ఇచ్చి, కుటుంబాలను నిర్ధారిం చే బాధ్యతను క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికార సిబ్బంది గ్రామానికి వెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్ లో కుటుంబ సభ్యుల వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. వారిని గుర్తించి ఒకే లిస్టులో వివరాలు పొందుపరచి సెల్ఫీఫొటో సైతం అప్లోడ్ చేస్తున్నారు.
ఇప్పటికే 2.65 లక్షల లోన్ అకౌంట్లకు సంబంధించి రైతు కుటుంబాలను గుర్తించి నట్లు సమాచారం. త్వరలోనే సర్వే మొత్తం పూర్తి చేసి, నిర్ధారించిన రైతుల అకౌంట్లకు రుణమాఫీ నిధులను బదిలీ చేయనున్నారు.
Share your comments