కరెంటు బిల్లు కట్టడం మర్చిపోతున్నారా! దీనివల్ల అధిక చార్జీలు కట్టవలసీవస్తుందా. ఇప్పుడు ఇటువంటి సమస్యలకు ప్రజలు చింతిచనక్కర్లేదు. ప్రతి ఒక్కరి ఇంటికి విద్యుత్ మీటర్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఒక్కోసారి మన ఇంటికి కరెంటు బిల్లు తీసేవారు ఆలస్యంగా వస్తే నెలకు పరిమిత యూనిట్లు దాటడం వలన అధికంగా కరెంట్ బిల్లు అనేది వస్తుంది.
వీటితోపాటు మనకు మీటర్ రీడింగ్ తీసుకున్న ఒక రోజు తరువాత అది ఆన్లైన్ లో అప్డేట్ అవుతాది. ఇలాంటి సమయాల్లో వేరే పనుల్లో ఉండి లేదా ఏదైనా ఊరు వెళ్లడం వలనో కరెంటు బిల్లు కట్టడం మర్చిపోతువుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి బిల్లు కట్టడం అనేది కుదరనిపని. ఇలా ఇబ్బందులు పడకుండా మన కరెంటు బిల్లును ఇప్పుడు మనమే నచ్చినప్పుడు కట్టుకోవచ్చు.
మన కరెంటు బిల్లు కట్టకోవడానికి మన మొబైల్ ఫోన్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీటర్ రీడింగ్ స్కాన్ చేసి కట్టేసుకోవచ్చు. ప్రస్తుతం సెల్ఫ్ మీటర్ రీడింగ్ పేరుతో 'భారత్ స్మార్ట్ సర్వీసెస్' అనే కొత్త యాప్ ను టీఎస్ఎస్పీడీసీఎల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ని ఉపయోగించి మీ మీటర్ రీడింగ్ మిరే తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
రేషన్‌కార్డుదారులకు శుభవార్త: వచ్చే నెల నుండి ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణి
ఈ యాప్ ను ఇన్స్టాల్ చేశాక ఇందులో కన్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు కరెంటు బిల్లు కడదాం అనుకుంటున్న మీటర్ వద్దకు వెళ్లి, ఈ భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ ఓపెన్ చేసి కన్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు స్కాన్ ఆప్షన్ వస్తుంది. దానిని ఉపయోగించి మీటర్ ని స్కాన్ చేస్తే చాలు.
స్కాన్ చేసిన తరువాత వివరాలను చూపిస్తుంది. అవి అన్ని సరిగ్గా ఉంటె నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. దీని తరువాత మనం చెల్లించవలసిన బిల్లు చూపిస్తుంది. దీనిద్వారా మనం చెల్లింపులు చేయచ్చు. ఈ యాప్ ను పొందాలి అంటే ప్లే స్టోర్ కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ లో మీ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ మీ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీని తర్వాత మీ మీటర్ ని మీరే స్కాన్ చేసి తక్షణంలో కరెంటు బిల్లును కట్టేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments