భారతీయ ప్రధాని నరేద్రమోడీ 2016 సంవత్సరంలో ఆకస్మికంగా పెద్ద నోట్ల రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే , పెద్ద నోట్లు 500,1000 రూపాయల నోట్లు నల్లధనం పెరగడానికి కారణంగా చూపుతూ ఈ కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రద్దు అయినా పెద్ద నోట్లని విడతలవారీగా బ్యాంకు ఖాతాల ద్వారా మార్చుకోవాలని ప్రజలను సూచించింది .
అయితే కొంతమంది తెలియక, అనేక కారణాలతో మార్చుకోవడానికి వీలుపడలేదు . అలాంటివారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లను దాఖలు చేసారు ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టు విచారం చేపట్టింది.
కోర్టులో దాఖలైన 500,1000 రూపాయల నోట్ల రద్దు పిటీషన్ పై ఈరోజు జస్టిస్ ఎస్ఏ నజీర్ ఆధ్వ ర్యంలోని ఐదుగు రు జడ్జీల బెంచ్ విచారణ చేపడుతూ తన తీర్పును వెల్లడించింది .
500,1000 రూపాయల నోట్ల రద్దు పై దాఖలైన సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను ఇప్పటికే విచారించిన సుప్రీం కోర్టు పిటిషన్ లను కొట్టి వేసింది .. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎప్పుడు వెన్నకి తీసుకునే వీలు లేదని దానిపై దాఖలైన పిటిషన్ లను కొట్టి వేసింది సుప్రీమ్ కోర్టు .
నూతన సంవత్సరం షాకింగ్ న్యూస్ :రూ.25 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ...
అయితే గతం లో విచారణలో భాగం గ RBI కి సుప్రీమ్ కోర్టు కీలక సూచనలను చేసింది . వివిధ కారణాలతో నోట్ల రద్దు సమయం లో నోట్లు మార్చుకొని వారికోసం RBI పరిష్కారమార్గాన్ని చూపాలని సూచనలను చేసింది . కొన్ని ప్రత్యేకమైన కారణాలతో నోట్లను మార్చుకొని వారికీ ఇప్పుడు వెసులుబాటు కల్పించేందుకు ఏదైనా అవకాశం ఉందా అని రిజర్వు బ్యాంకును సుప్రీం కోర్టు కోరింది. కోమాలో ఉన్న ఒకమహిళా డబ్బు మార్చుకోలేదని దీనికి ఉదాహరణగా చూపింది . నిజాయితీగా, సరైన కారణాలతో అప్పట్లో డబ్బు డిపాజిట్ చేయలేకపోయిన వారి కేసుల విషయంలో పరిష్కారాన్ని అన్వేషిచాలని RBI ను సుప్రీమ్ కోర్టు సూచించింది .
Share your comments