ఈ ఆధునిక మరియు సాంకేతిక కాలంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ప్రజలందరికీ నిరంతర విద్యుత్ సరఫర అనేది ప్రభత్వానికి కష్టతరంగా మారింది. ఈ విద్యుత్ వినియోగం పెరగడం వలన విద్యుత్ కొరత ఏర్పడింది. కొరత వలన విద్యుత్ చార్జీలు పెరుగుతున్నందున పేద మరియు మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారానికి ప్రభుత్వం కొత్త ప్రయత్నాలను చేస్తుంది.
విద్యుత్ సరఫర సమస్యలను మరియు విద్యుత్ ప్రమాదాలను అరికట్టడానికి సోలార్ విద్యుత్ యూనిట్ల ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ సోలార్ విద్యుత్ ని వినియోగించడం వలన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వారికి విద్యుత్ బిల్లులు కూడా ఈ సోలార్ వినియోగంతో తగ్గుతాయి.
ఈ సోలార్ విద్యుత్ శక్తిని వినియోగించడం వలన పర్యావరణాన్ని రక్షించవచ్చు. ప్రభుత్వం సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పిస్తుంది. ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడతగా మొత్తానికి ప్రభుత్వం 123 సోలార్ యూనిట్లను అందించింది. ఈ సోలార్ పానెల్స్ ను రుణాలతో స్త్రీనిధి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసేందుకు అవగాహన కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు.
ఈ సోలార్ విద్యుత్ వినియోగానికి స్త్రీనిధి ద్వారా రుణాలను అందిస్తున్నారు. ఈ స్వశక్తి సంఘాల్లో ఉన్న మహిళలకు స్త్రీనిధి నిధులతో సబ్సిడీ రుణాలు అందించి, ఆ మహిళలకు ఈ సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సోలార్ యూనిట్లకు సబ్సిడీ మినహా మిగిలిన డబ్బులను నెలల వారీగా చెల్లించే అవకాశాన్ని కూడా ఇస్తుంది.
ఇది కూడా చదవండి..
రూ.2వేల నోటు రద్దు పై క్లారిటీ ఇచ్చినా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!
ఒక రెండు కిలో వాట్స్ యూనిట్ అనేది నెలకు 150 నుండి 200 యూనిట్లు వాడుకునే వారికి సరిగ్గా సరిపోతాయి. ఈ యూనిట్ ద్వారా రోజుకు 8 యూనిట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ పెద్ద కుటుంబం అనుకుంటే కనుక మూడు కిలో వాట్స్ యూనిట్ ను ఏర్పాటు హెసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉత్పత్తి అనేది వినియోగం కన్నా ఎక్కువ ఉంటె, ఆ కరెంటును విక్రయించి కూడా ఆదాయం పొందవచ్చు.
ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం విలువ అనేది రూ.1,42,000 నుండి రూ.1,92,360. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి రుసుం వచ్చేసి రూ. 2,360 రూ. 3,450. శ్రీనిధి రుణం అనేది రూ. 1,00,000 నుండి రూ. 1,25,000 వరకు అందిస్తున్నారు. రూ. 2,243 నుండి రూ. 2,803 అనేది నెలవారీగా చెల్లించాలి. ఈ సోలార్ పానెల్స్ ఇంటికి బిగించడానికి ఇంటి పరిమాణం అనేది 160నుంచి 200చదరపు అడుగులు ఉండాలి.
ఇది కూడా చదవండి..
Share your comments