రాష్ట్రంలో వానకాలం (ఖరీఫ్) సీజన్ కోసం రైతు బంధు ఆర్థిక సహాయం పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఎకరం లోపు భూమి ఉన్న 22,55,081 మంది రైతులకు తొలిరోజు రూ.642.52 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.నేటి నుంచి ఎకరం పైబడిన రైతుల ఖాతాలో డబ్బులు జామకానున్నాయి.
2023-24 వానకాలం సీజన్ కోసం రైతు బంధు పథకం 11వ విడత కింద సుమారు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు రూ.7,720.29 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్ వరకు రైతు బంధు పథకం ద్వారా మొత్తం రూ.72,910 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేసింది.
ఇకపై, 4 లక్షల ఎకరాల పోడు భూములను కలిగి ఉన్న 1.5 లక్షల మంది పోడు రైతులతో సహా మరో ఐదు లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఈ పథకం కింద ఎకరాకు రూ. 10,000 అందజేస్తారు.
రైతుబంధు కింద 70 లక్షల మంది రైతులకు రూ.7,720 కోట్లు విడుదల ..!
వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు మొత్తాన్ని వారి భూమి యాజమాన్యం ఆధారంగా ప్రతిరోజు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని, పంటకాలం తర్వాత లాభసాటి ఆదాయం వచ్చేలా వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని రైతులకు సూచించారు.
రైతు బంధు పండుగ ప్రారంభమైందని, సోమవారం నుంచి లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌లో తెలిపారు.
" ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అభివృద్ధి మరియు సంక్షేమమే అత్యధిక ప్రాధాన్యత కలిగిన రైతులకు ఈరోజు రూ.645.52 కోట్లు జమ " అని ఆయన ప్రకటించారు.
Share your comments