నిర్మల్ జిల్లా అనంతరం ,ఎల్లపల్లి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ మాట్లాడుతూ పోడు పట్టా పొందిన రైతులకు ఈ వానాకాలం సీజన్ నుంచే రైతుబంధు అమలు చేయనున్నట్లు తెలిపారు . అదేవిధంగా ధరణి పోర్టల్ పట్ల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రజలే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు .
రాష్ట్రంలో ఎంతమందికి కొత్త పోడు పట్టాలు రాబోతున్నాయి ?
2,845 గ్రామాల్లోని గిరిజన రైతుల కోసం 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు మంజూరు చేయనున్నట్లు గతంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
జూన్ 24 నుంచి జూన్ 30 వరకు పోడు భూ పట్టాల పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్ల సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి, పట్టా మంజూరుతో మొత్తం 1,50,224 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
రైతుబంధు సాయం కూడా వెంటనే అందేలా భూమి పట్టాలు ఇచ్చిన వెంటనే ప్రతి లబ్ధిదారుడి పేరున బ్యాంకు ఖాతాలు తెరిచేలా గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా కలెక్టర్లు సహకరించాలన్నారు.
'రైతుబంధు' కొత్త దరఖాస్తుల స్వీకరణ ..!
రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబంధు డబ్బులకోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు జూన్ నెలలో రైతు బందు వస్తుందని కొన్ని మీడియా కధనాలు వెల్లడించిన్నపటికి రైతుబంధు డబ్బులు జూన్ నెలలో వచ్చే అవకాశాలు తక్కువ గ కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులనుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది .
మరోవైపు కొత్తగా ఇస్తున్న పోడు పట్టాలు జూన్ 30 వరకు పంపణీ జరుగుతుంది కనుక .. రైతుబంధు జులై నెలలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ రంగ నిపుణులు భావిస్తున్నారు.
Share your comments