సాధారణంగా మనం ప్రస్తుతం కేవలం తెల్లగా సన్నని పాలిష్ చేసిన బియ్యాన్ని మాత్రమే తింటూ ఉంటాము. మనకు తెలిసినంత వరకు తెల్లని బియ్యం ఒకటే మనకు అందుబాటులో ఉన్నాయని భావిస్తాము.కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే కేవలం ఈ రకానికి చెందినవి మాత్రమే కాకుండా సుమారు 50 రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుత కాలంలో ఎక్కువ పాలిష్ చేసిన తెల్లని బియ్యం తినడం వల్ల ప్రజలందరూ ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది చూపు బ్రౌన్ రైస్ వైపు మళ్లింది.
ప్రస్తుతం మార్కెట్లో నల్లబియ్యం, బ్రౌన్ రైస్ వంటి వాటికి డిమాండ్ పెరగడంతో ఈ రకమైన వంగడాలను పండించడానికి రైతులకు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నల్ల బియ్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల బియ్యంలో విశిష్టమైన పోషకాలు మాత్రమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పలు అధ్యయనాలలో నిరూపితమైనది.
ఈ నల్ల బియ్యాన్ని పాలిష్ చేయకుండా తినడం వల్ల ఈ బియ్యంలో గ్లైసిడిన్ తక్కువగా ఉంటుంది. ఈ విధంగా గ్లైసిడిన్ తక్కువగా ఉండే బియ్యం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. ఈ విధమైనటువంటి బ్లాక్ రైస్ కు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉండడంతో ఇలాంటి వంగడాలను పండించడానికి సిద్ధిపేట జిల్లా, తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన జక్కుల రేణుక. ఆమె తన భర్త తిరుపతితో కలిసి మూడు ఎకరాల్లో సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు.
ఈ విధమైనటువంటి శ్రీ వరి సాగు చేయడానికి ఎకరాకు 2 కిలోల విత్తనాలు అయితే సరిపోతాయి. ఈ విధంగా ఎకరాకు 20 బస్తాల వరకు దిగుబడిని పొందవచ్చు. నాలుగు నెలలలో నల్లబియ్యం పంట పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ విధమైనటువంటి రకానికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. కేవలం కిలో నల్ల బియ్యం మార్కెట్లో 150 రూపాయల వరకు ధర పలకడం విశేషం.
Share your comments