News

తెలంగాణలో పెరగనున్న పాల ధరలు… పాత బకాయిలు తీర్చడానికే

KJ Staff
KJ Staff

తెలంగాణలో పాల ధరలు మే నుండి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లీటరు పాలు రూ.48 ఉండగా, త్వరలోనే రూ.51కి పెరగనుంది అని తెలంగాణ రాష్ట్ర డైరీ డెవెలప్మెంట్ ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. విజయ తెలంగాణ డెయిరీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గతంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, మూడు దఫాలుగా పాల ధరలు పెంచి, ప్రస్తుతం లీటరు పాలను రూ.42.24 రూపాయిలకు రైతుల నుండి కొనుగోలు చేస్తోంది.

అయితే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరకు పాలు అందుబాటులో ఉండటంతో, తెలంగాణ మార్కెట్లో పాల సేకరణ ధర గణనీయంగా తగ్గింది. దీని వల్ల అసలే అప్పుల్లో ఉన్న ఈ సంస్థ మరింత నష్టాల్లోకి జారుకుంటోంది. 

ప్రస్తుతం ప్రైవేట్ డెయిరీలు, కొన్ని కో -ఆపరేటివ్ రంగంలోని డెయిరీలు పక్క రాష్ట్రాల నుంచి లీటర్ రూ. 27 నుంచి రూ. 32 చొప్పున పాలని సేకరించి, మార్కెటింగ్ కమీషన్లను పెంచి తెలంగాణలో అమ్మకాలను పెంచుకుంటున్నాయని, దీని ప్రభావం విజయ తెలంగాణ అమ్మకాలపై పడుతోంది అని, అమిత్ రెడ్డి వాపోయారు.

అంతే కాకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీలు విజయ పేరుతో బోగస్ డైరీలు పెట్టి అక్రమంగా అమ్మకాలు జరుపుతున్నాయని ఆరోపించారు. ఈ నకిలీ విజయ బ్రాండ్ల ద్వారా విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గి ప్రతి రోజు సుమారు 2.8 లక్షల లీటర్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి అని మండిపడ్డారు. 

పాడి రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యం తో ఎటువంటి లాభాపేక్ష లేకుండ ఇతర ప్రైవేటు, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ తెలంగాణ ఇప్పుడు దాదాపు రూ.8-9 ఎక్కువగా చెల్లిస్తోందని, ఆవు పాల సేకరణ ధర రూ 42.24 ప్రతి లీటరుకు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. 

ఇలా దేశంలోనే అత్యధిక ధర చెల్లించటంతో పాటు అమ్మకాలు తగ్గడంతో, ప్రతి నెలా  పాడి సమాఖ్య రూ. 12 కోట్లు నష్టపోతోంది.  అయితే అతిత్వరలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ 60.00 కోట్లతో పాత పాల బకాయిలను తీరుస్తామని గుత్తా అమిత్ రెడ్డి హామీఇచ్చారు.

అయితే అసలే నిత్యావసర ధరలు పెరిగి బాధపడుతున్న సామాన్యులు, చిన్నకారు రైతులు మాత్రం ఈ పరిణామం వల్ల మరింతగా ప్రైవేట్ డైరీ కంపెనీల నుండి పాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల కొంత మేరకు ఈ నిర్ణయం విజయ తెలంగాణ డైరీ కి మరో దెబ్బ అవ్వొచ్చు అని వాదన

Share your comments

Subscribe Magazine

More on News

More