మారుతున్న కాలం మరియు అవసరాలకు అనుగుణంగా, చక్కెరను ఇథనాల్‌గా మార్చే దిశగా మారాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వెల్లడించారు.ఎప్పటిలాగే చక్కెర ఉత్పత్తి కొనసాగితే రాబోయే కాలంలో పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని చక్కెర, అనుబంధ పరిశ్రమల యజమానులకు మంత్రి హెచ్చరిక చేసారు. చక్కెర ఉత్పత్తిని తగ్గించి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడమే మన భవిష్యత్తుకు మంచిదని చక్కెర కర్మాగారాలకు స్పష్టమైన పిలుపు ఇచ్చారు.
మార్చి 20, 2022న ముంబయిలో జరిగిన షుగర్ & ఇథనాల్ ఇండియా కాన్ఫరెన్స్ (SEIC) 2022లో మంత్రి ప్రసంగించారు. రాబోయే కాలానికి
ఇథనాల్, మిథనాల్, బయోఇథనాల్, బయో-సిఎన్జి, బయోడీజిల్, బయో-ఎల్ఎన్జి, గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎలక్ట్రిక్ల వంటి వాటికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి చక్కెర ఉత్పత్తిని తగ్గించి దానిని ఇథనాల్‌గా మార్చడాన్ని పెంచాలి , చక్కెర పరిశ్రమను కాపాడుకోవడానికి ఇది ఎంతో అవసరం అని మంత్రి వర్యులు పేర్కొన్నారు. షుగర్ మరియు అనుబంధ పరిశ్రమల కోసం న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్, ChiniMandi నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ దేశీయ & ప్రపంచ పరిశ్రమ నిపుణులను ఒకచోట చేర్చేందుకు ప్రయత్నించింది. దేశీయ మరియు ప్రపంచ చక్కెర వ్యాపారంలో సవాళ్లు మరియు ప్రమాద ప్రతిస్పందన వ్యూహాలను చర్చించడానికి భారతదేశంలో మరింత వినూత్నమైన మరియు స్థిరమైన చక్కర & ఇథనాల్ రంగాన్ని నిర్మించడానికి ముందుకు వెళ్లడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
ఇథనాల్ కి అతి పెద్ద మార్కెట్ ఉంది.
ఇథనాల్‌కు తగినంత మార్కెట్ ఉంటుందో లేదోనని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. ఇథనాల్ ఒక స్వచ్ఛమైన ఇంధనం. ప్రస్తుతం 465 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. అయితే, E-20 కార్యక్రమం పూర్తయితే, మన అవసరాలు దాదాపు 1,500 కోట్ల లీటర్లు అవుతుంది. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్లలో, ఫ్లెక్స్ ఇంజన్లు సిద్ధమైనప్పుడు, ఇథనాల్ అవసరం 4,000 కోట్ల లీటర్లు అవుతుంది. మీరు ఇథనాల్‌గా మార్చకుండా, చక్కెరను ఉత్పత్తి చేస్తూనే ఉంటే, ఫ్యాక్టరీ నష్టాల పాలవుతుందని మంత్రి హెచ్చరించారు. చెరకు రసం నుండి సిరప్‌ను ఉత్పత్తి చేయడం మరియు దాని నుండి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అని ఆయన తెలిపారు.
ప్రతి ఫ్యాక్టరీ బి మొలాసిస్లోకి వెళ్లాలని మంత్రి అన్నారు. “డిసెంబర్ 2023 తర్వాత చక్కెర ఎగుమతి సబ్సిడీని నిలిపివేస్తామని భారతదేశం వాగ్దానం చేసింది. కాబట్టి, ప్రతి ఫ్యాక్టరీ B మొలాసిస్లోకి వెళ్లాలి. చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తేనే చక్కెరకు గిట్టుబాటు ధర లభిస్తుంది. B మొలాసిస్ కోసం ప్రభుత్వం 245 కోట్ల లీటర్లను రిజర్వ్ చేసింది; అయినప్పటికీ, కేవలం 55 కోట్ల లీటర్లు లేదా 22% మాత్రమే సరఫరా చేయబడింది.దీని ద్వారా చక్కెర కర్మాగారాలను కూడా రక్షించవచ్చు మరియు ఇథనాల్‌తో మన ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది.
మరిన్ని చదవండి.
Share your comments