ఎండా వేడి ,ఉక్కపోత ద్వారా ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను చల్లటి వర్షపు జల్లులు తాకనునట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది , దీనితో ఎండా నుంచి ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు .
ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. పగటి పూట ఎండ, సాయంత్రానికి వర్షాలు పడతాయని వివరించారు అధికారులు.
15వ తేదీ ఒకటీ రెండు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని సూచన చేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయన్నారు. 16న ఉత్తర, పశ్చిమ, మధ్య దక్షిణ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని.. 17 18 తేదీల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేసారు వాతావర శాఖ అధికారులు .
రైతులకు శుభవార్త.. ధరణిలో FAQ ఆప్షన్ .. రైతుల అన్ని సమస్యలకు సమాధానం !
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బులెటిన్లో తెలిపింది. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 16, 17 తేదీల్లో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. 17న మాత్రం వర్షాలు మరింత భారీగా ఉంటాయని అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Share your comments