గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.
రాబోవు ఐదు రోజుల వాతావరణం:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 33 నుండి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
రాబోవు రెండు రోజులలో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు (30-40) కి.మీ. వేగంతో మరియు వడగళ్ళతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
అదేవిధంగా బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమగాలులు, మధ్య భారతం నుంచి వస్తున్న పొడిగాలుల కలయికతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తరకోస్తాలో వర్షాలు కురిశాయి. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ విజయనగరం, విశాఖపట్నం ,జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసాయి . కాగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల ఎండ తీవ్రత నెలకొంది. అనంతపురంలో 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బిహార్ నుంచి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతున్నందున రానున్న రెండు రోజుల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Share your comments