![](https://telugu-cdn.b-cdn.net/media/irulfmk1/rain-111.jpg)
ఉత్తర బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతుందని, మరో 24 గంటల్లో పెను అల్పపీడనంగా మారే అవకాశం.
ఉత్తర బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతుందని, మరో 24 గంటల్లో పెను అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు.. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త .. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కీలక ప్రకటన..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ., వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుందని, ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
Share your comments