భారతదేశంలో ప్రధానంగా పండించే పంటల్లో మిరప పంట కూడా ఒకటి. దేశంలోనే ఈ మిరప సాగులో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ మిరపలో విటమిన్ సి మరియు బి, కాల్షియమ్, మెగ్నీషియం, ఐరన్ అనేవి అధికంగా ఉంటాయి. ఈ నాణ్యతగల మిర్చిని భారతదేశం నుండి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ యార్డులో ఎండు మిర్చికి అధిక ధరలు పలుకుతున్నాయి.
ఆరుగాలం కస్టపడి పంటలు పండించిన రైతులకు పంటను ఆశిస్తున్నా తెగుళ్ల వల్లన నష్టాలు కలుగుతున్నాయి. అలాంటి ఈ సమయంలో పెరుగుతున్న మిర్చి ధరలు రైతులకు సంతోషాన్ని కలిగించే విషయమే. ఆశించిన ధరల కంటే మిర్చి మార్కెట్ లో అధిక ధరలు లభిస్తున్నందున రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కర్నూలు మిర్చి యార్డులో ఎండు మిర్చికి అధిక ధరలు లభిస్తున్నాయి.
గుంటూరు మార్కెట్ లో కంటే కర్నూలు మార్కెట్ యార్డులోనే మిర్చికి అధిక ధరలు లభిస్తున్నాయి. దీనితో పక్క రాష్ట్రాల నుండి కూడా మిర్చిని కర్నూలు మార్కెట్కు తెచ్చి మరి రైతులు విక్రయిస్తున్నారు. కర్నూలు మర్చి మార్కెట్ యార్డుకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుండి గుంటూరు యార్డును దాటి కిక్కాఫ్డ్సా మిర్చి రైతుకు విక్రయిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
రైతు వేదికల ద్వారా అందుబాటులోకి ఎరువులు..
కర్నూలు మిర్చి యార్డులో శుక్రవారం ఒక క్వింటా ఎండుమిర్చికి ధర వచ్చేసి రూ.34 వేలు లభించింది. కానీ శనివారం కర్నూలు మిర్చి యార్డులో క్వింటా ఎండుమిర్చికి ఏకంగా రూ.48,786 పలికింది. అంటే ఒక్కరోజుల ఒక క్వింటా మిర్చికి రూ.16 వేలకు పైగా ధర పెరిగింది. శనివారం కర్నూలు మిర్చి యార్డులో 295 క్వింటాళ్ల ఎండు మిర్చి బస్తాలను రైతులు విక్రయానికి తీసుకువచ్చారు.
కర్నూలు మిర్చి యార్డుకు వచ్చిన రైతులు అధిక ధర పలకడంతో చాలా సంతోషపడ్డారు. గుంటూరు యార్డులో కంటేకర్నూలు మార్కెట్ అధిక ధరలు లభిస్తున్నాయి అని ఇక్కడిఎండుమిర్చిని విక్రయించామని రైతులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments