
మహీంద్రా 275 DI TU PP ట్రాక్టర్ తో పని సామర్ధ్యాన్ని పెంచి, పని వాళ్ళ ఖర్చుని తగ్గించి, లాభాలను మెరుగు పరుచుకొని, తన వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఒక విన్నూతనమైన ఆధునిక రైతు అయిన ప్రహ్లాద్ ప్రజాపతి, ఈ విజయం మహీంద్రా అద్భుతమైన సేవ అలానే మద్దతు వల్లనే సాధ్యం అంటున్నాడు.
ప్రహ్లాద్ ప్రజాపతి ఒక కాయకష్టం చేసుకునే రైతు కి మధ్య ప్రదేశ్ లో ఒక మారుమూల గ్రామంలో పుట్టి, సాంకేతికతతో ఆధునిక వ్యవసాయం చేసి అధిక ఉత్పత్తి, రాబడి సాదించాలి అనుకునే రైతులకి ప్రేరణగా నిలిచాడు. తన చిన్నతనం నుండే వ్యవసాయం తో ముడి పడి ఉన్న ప్రహ్లాద్, ఇప్పుడు మహీంద్రా 275 DI TU PP మద్దతు మరియు సాయంతో ఒక రైతుగా విజయం సాధించాడు.
పాత విధానాలు, అన్నీ కష్టాలు- కొత్త ట్రాక్టర్, మరింత లాభాలు:
ప్రహ్లాద్ వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు, పాత ట్రాక్టర్లతో, సాంప్రదాయ విధానాలతో కుస్తీ పట్టి, చాలా సమయాన్ని వెచ్చించి కష్ట పడ్డాడు. ఎలాగైతేనేం మహీంద్రా 275 DI TU PP కొనడం తో తాను వ్యవసాయం చేసే తీరు పూర్తిగా మారిపోయింది. ఈ ట్రాక్టర్ కేవలం శక్తివంతమైన ఇంజిన్ తో మాత్రమే కాదు, అధునాతన హైడ్రాలిక్ వ్యవస్థ వంటి సాంకేతిక లక్షణాలతో, ఇచ్చిన అన్ని పనులని ఎంతో సులువుగా చేస్తుంది.
శక్తివంతమైన పనితీరు, ఇక ప్రతి పని ఎంతో సులువు
- ప్రహ్లాద్ మాట్లాడుతూ “ ఈ ట్రాక్టర్ నా జీవితాన్ని మార్చింది. పొలం దున్నడం, మట్టి చదును చెయ్యడం, వంటి కష్టతరమైన పనులు అన్ని ఎంతో సులువుగా చెయ్యగలుగుతున్నాను. ఈ ట్రాక్టర్ తో ఎంతో సమయం అలానే శ్రమ తగ్గాయి” అన్నాడు.
- ఇంకా ఈ ట్రాక్టర్ లో ప్రహ్లాద్ కి నచ్చిన లక్షణాలు ఏంటంటే:
- శక్తివంతమైన 39 HP ఇంజిను - అద్భుతమైన పనితీరు ఏ పరిస్థితిలోనైనా.
- గొప్ప మైలేజ్ - అధిక పని, అతితక్కువ ఇంధనం, ఖర్చులలో ఆదా.
- బలమైన లిఫ్టింగ్ సామర్ధ్యం - ఇబ్బంది లేకుండా బరువులు లేపడం, ఎలాంటి నేలనైనా దున్నటం.
- సౌకర్యవంతమైన నడుపు - ఎటువంటి ఇబ్బంది, భారం లేకుండా, అధిక సమయం పని చెయ్యడం.
- అతి తక్కువ నిర్వహణ - 400 గంటల సర్వీస్ ఇంటర్వెల్ తో, తక్కువ నిర్వహణ అవసరం, దాంతో ఎక్కువ పొదుపు.
మహీంద్రా : ప్రతి రైతుకు ఒక నమ్మకమైన భాగస్వామి
మహీంద్రా యొక్క అద్భుతమైన పనితీరుని ప్రహ్లాద్ ఎంతో గొప్పగా చెప్పాడు. “ఎప్పుడైన ట్రాక్టర్ కి ఏదైనా సమస్య వచ్చినా, మహీంద్రా టీమ్ వెంటనే పరిష్కరించే వాళ్ళు. కొనడం చాలా సులువుగా జరిగింది, సర్వీస్ ఇంకా బాగుంది, అందుకే ఇప్పటిదాకా నాకు ఎటువంటి సమస్య రాలేదు.”
“ప్రతి రైతుకి ఒక మహీంద్రా 275 DI TU PP ఉండాలి ”
తన తోటి రైతులందరికి ప్రహ్లాద్ సలహా ఏంటంటే, తక్కువ శ్రమ తో అధిక లాభాలు రావాలి అంటే అందరి దగ్గర మహీంద్రా 275 DI TU PP ఉండాలిసిందే అని. ఈ ట్రాక్టర్ తన వ్యవసాయానికి ఒక కొత్త మార్గాన్ని సూచించింది, ఆ మార్గంలో తాను ఉన్నతి వైపుకి అడుగులు వేస్తున్నాడు.
మహీంద్రా ట్రాక్టర్ కేవలం ఒక యంత్రం కాదు, రైతుల ప్రతి కలని నెరవేర్చే ఒక భాగస్వామి. ప్రహ్లాద్ ప్రజాపతి విజయ గాథ, అధునాతన సాంకేతికతకు, చెమటోడ్చిన రైతు శ్రమ తోడైతే సాధించ గలిగే వ్యవసాయ రాబడికి, మరియు లాభాలకి ఒక తార్కాణం.
Share your comments