అన్నదాతలకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం 11వ విడతగా రూ. పీఎం కిసాన్ డబ్బును ఈ నెలలో ఎప్పుడైనా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి.
కేంద్ర ప్రభుత్వం PM KISAN పథకం ద్వారా రైతులకి వ్యవసాయం లో పెట్టుబడికి ఏడాదికి రూ.6000 ను చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని 3 వాయిదాల్లో అంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి చొప్పున రైతుల కథల్లో జమ చేస్తోంది.దీనికి సంబంధించి ఇప్పుడు 11వ విడత డబ్బులు జమ కావాల్సి ఉంది.
లబ్ధిదారుల జాబితాలో మీరు ఉన్నారా?
www.pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి హోమ్‌పేజీలో ''FARMERS CORNER'' కి వెళ్ళండి.
తర్వాత 'Beneficiary List 'పై క్లిక్ చేయండి.
ఇప్పుడు రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్ మరియు గ్రామం వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి. GET REPORT పై క్లిక్ చేయండి.మీరు ఇప్పుడు పూర్తి జాబితాని చూడవచ్చు.
eKYC గడువు మే 31 వరకు పొడగింపు:
ప్రభుత్వం eKYCని పూర్తి చేయడానికి గడువును 31 మే 2022 వరకు పొడిగించింది. అందువల్ల రైతులు PM కిసాన్ eKYCని అప్‌డేట్ చేయడానికి తమ సమీప CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.
PM KISAN యోజన కోసం ఎలా నమోదు చేసుకోవాలి
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం నమోదు చేసుకోవడానికి క్రింద ఇవ్వబడిన సూచనలను అనుసరించండి;
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి www.pmkisan.gov.in
ఇక్కడ హోమ్ పేజీలో FARMERS CORNER కి వెళ్ళండి
ఆ తర్వాత NEW FARMER REGISTRATION పై క్లిక్ చేయండి.
తర్వాత దరఖాస్తు పారం లో ఆధార్ కార్డ్,బ్యాంక్ వివరాలు,భూమి పత్రాలు,మొబైల్ నంబర్ మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
PM KISAN పథకానికి సంబంధించిన సమస్యలు మరియు ఇతర పూర్తి వివరాలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను నెంబర్లను సంప్రదించవచ్చు. 011-23381092, 155261 లేదా 1800115526
మరిన్ని చదవండి.
Share your comments