కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలురకాల పథకాలను ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా ప్రతి యేటా రైతులకు 6 వేల రూపాయల నగదును వారి ఖాతాల్లో జమ చేయనుంది.అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ చేస్తారు.ఇప్పటికే ఈ పథకం ద్వారా రైతులకు 8 విడతల డబ్బులు వారి ఖాతాలో జమ చేశారు. ఇక 9 వ విడత డబ్బులు నేడే రైతుల ఖాతాలో జమఅయి ఉంటాయి.
తాజాగా పీఎం కిసాన్ డబ్బులను నేడు (ఆగస్టు 9వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతులకు లాభం చేకూరుతుంది. పీఎం కిసాన్ 9వ విడతలో భాగంగా..రూ.19వేల 500 కోట్లు బదిలీ కానున్నాయి.అయితే లబ్ధిదారులు ఈ డబ్బులు తమ ఖాతాలో పడ్డాయో లేదో అనేది ఎంతో సులభంగా బ్యాంకుకు వెళ్లి పని లేకుండా తెలుసుకోవచ్చు.
ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి pmkisan.gov.in కి వెళ్లండి. అక్కడ లబ్ధిదారుని స్థితి పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డేటా పొందండి బటన్ పై క్లిక్ చేస్తే మన అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో తెలిసిపోతుంది.
Share your comments