సింగంపేట గ్రామంలో రేషన్ బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులకు షాక్ అయ్యే విషయం బయట పడింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి మండల పరిధిలోని సింగంపేట గ్రామంలోని ప్రజలు ఎప్పటిలాగే రేషన్ బియ్యాన్ని అందుకున్నారు. కానీ అక్కడి అందుకున్న రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలవడంతో లబ్ధిదారులు అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
సింగంపేట గ్రామంలోని ప్రజలు ఎప్పటిలాగే నెలవారీ రేషన్ సామాన్లను రేషన్ దుఖాణం నుండి వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు. ఆ రేషన్ బియ్యాన్ని వంట చేసుకోవడానికి అని గిన్నెలో పోసి కడుగుతున్నారు. ఇలా కడుగుతుండగా ఇంతలో బియ్యం నీటిపై తేలడంతో ప్రజలకు అనుమానం వచ్చింది. గ్రామంలోని ప్రజలు ఒకరికొకరు చూయించుకొని అవాక్కైనట్లు గ్రామ ప్రజలు తెలిపారు.
ఇది కూడా చదవండి..
త్వరలోనే 'పింఛన్ మార్పిడి'.. తెలంగాణ మంత్రి కేటీఆర్
ఈ సందర్భంగా ప్రత్యేకించి రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలవడానికి సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్షంగా కారణమని గ్రామా ప్రజలు అంటున్నారు. అధికారుల నిర్లక్షంతోనే బియ్యంలో ప్లాస్టిక్ బి య్యం కలిసాయని ప్రజలు ఆరోపించారు. ఈ బియ్యం తినడం ద్వారా ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.
ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి, గ్రామంలోని రేషన్ బియ్యాన్ని పరిశీలించి, సంబంధించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..
Share your comments