జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర మూడో దశ ఇవాళ విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటికే రెండు దశలుగా చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో అధికార పార్టీపై పవన్ దూకుడు పెంచారు. ముఖ్యంగా యాత్రలో, ప్రభుత్వ ప్రవర్తన పట్ల నిరుత్సాహం మరియు ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం.
వీటితోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ, పక్కా ఆధారాలను కూడా చూపుతున్నారు. కాగా వారాహి యాత్ర యొక్క రెండో దశను జనసేన పార్టీ ఏలూరు జిల్లా నుంచి ప్రారంభించింది. ఈ రెండో దశ యాత్రలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'హలో ఏపీ.. బైబై వైసీపీ' అనే నినాదంతో రెండో దశ యాత్రను సాగించారు.
ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొంతమంది వాలంటీర్లు కొన్ని నేరాలు చేశారన్న వాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన తరువాత, వైసీపీ నాయకులు పవన్‌ను వ్యక్తిగతంగా దూషించడం మరియు కించపరచడం ప్రారంభించారు మరియు పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టడం వంటివి జరిగాయి.
ప్రస్తుతం ఈ రోజు నుండి మూడో దశ యాత్ర ప్రారంభంకానుంది. ఈ మూడో దశ యాత్ర ఇవాళ్టి నుండి ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ మూడో దశ యాత్రలో ఇంకా ఎలాంటి నిజాలను బయటపెడతారో అని ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి..
రేషన్‌లో ప్లాస్టిక్ బియ్యం కలకలం.. ఆదోళనలో గ్రామ ప్రజలు.. ఎక్కడదంటే?
విశాఖపట్నంలో వారాహి యాత్రకు అనుమతి ఇవ్వాలని జనసేన నేతలు పోలీసులను అనుమతి కోరారు. అయితే విశాఖలో జరిగే వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. జనసేన పార్టీకి జగదాంబ సెంటర్‌లో ర్యాలీ చేయడానికి అనుమతి ఇవ్వలేదు, కేవలం సభకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. వాహన ర్యాలీలు, అభివాదం చేయవద్దని స్పష్టంగా పోలీసులు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కార్యకర్తలు, అభిమానులు భవనాలు, ఇతర నిర్మాణాలపై ఎక్కడానికి ప్రయత్నించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా జనసేన పార్టీ అనుమతి పొందిన వారిదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏది ఏమైనా వారాహి యాత్రకు పోలీసులు కఠిన షరతులు విధించడం పట్ల జనసేన పార్టీ సభ్యులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments