బ్యాంకింగ్ వంటి ఆర్ధిక కార్యకలాపాలను మరియు సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ ను తప్పని సరి చేసింది కేంద్రం.ఈ ప్రక్రియని గతంలోనే వచ్చే ఏడాది 2023 మార్చి 31 వరకు పొడిగించిన సంగతి విదితమే అయినప్పటికీ....
2023 మార్చి 31 నాటికి ఆధార్ లింక్ కాని పాన్ కార్డులు పనిచేయవని ఆదాయపు పన్ను శాఖ శనివారం ప్రకటించింది. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్కార్డు హోల్డర్లందరూ 31.3.2023లోపు తమ పాన్ను ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి లింక్ కాని పాన్కార్డు పనిచేయదని ఐటీశాఖ ప్రకటించింది.
కార్డుతో ఐటీ రిటర్న్ ను ఫైల్ చేయడం కుదరదు. అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు కేవైసీ (నో యువర్ కస్టమర్) ముఖ్యం కాబట్టి బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ పోర్టల్ వంటి అనేకచోట్ల పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సీబీడీటీ సర్క్యులర్ పేర్కొంది.
2023 మార్చ్ 31 లోగ పాన్ -ఆధార్ లింక్ చేయాల్సిందే .. మీ లేదంటే బ్యాంకింగ్ సేవలకు ఆటంకం
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అస్సాం, జమ్మూ కాశ్మీర్ మేఘాలయ రాష్ట్రాల్లో నివసిస్తున్న వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం నాన్ రెసిడెంట్ ఇండియన్లు, భారతదేశ పౌరుడు కానివాళ్లు 'మినహాయింపు వర్గం' లోకి వస్తారు. పాన్కార్డు పనిచేయకపోతే, ఐటీ చట్టం ప్రకారం తీసుకునే అన్ని చర్యలను సంబంధిత వ్యక్తి ఎదుర్కోవాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ ఏడాది మార్చి 30న జారీ చేసిన సర్క్యులర్లో హెచ్చరించింది. పని చేయని పాన్ కార్డు తో ఎటువంటి బ్యాంకింగ్ లావాదేవీలు జరపడం కూడా కాస్త తరం అవుతుందని పేర్కొంది .
Share your comments