News

పాన్ ఆధార్ లింకింగ్ కు ఇంకా 3 రోజులే గడువు ..ఇప్పుడే లింక్ చేసుకోండి !

Srikanth B
Srikanth B

బ్యాంకింగ్ వంటి ఆర్ధిక కార్యకలాపాలను మరియు సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్‌ ను తప్పని సరి చేసింది కేంద్రం.ఈ ప్రక్రియని గతంలోనే వచ్చే ఏడాది 2023 మార్చి 31 వరకు పొడిగించిన సంగతి విదితమే అయినప్పటికీ....

. కొద్ది రోజుల్లో మీ పాన్ కార్డ్ పనిచేయకపోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. పాన్ కార్డ్ ఉన్నవారంతా తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాల్సిందే. పాన్ ఆధార్ లింక్ చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ. అప్పట్లోగా పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి మీ దగ్గరున్న పాన్ కార్డ్ పనికి రాదు .

ఈ మేరకు Central Board of Direct Taxes పత్రికా ప్రకటన విడుదల చేసింది. "పన్ను చెల్లింపుదారులకు 31 మార్చి 2023 వరకు తమ ఆధార్‌ను ఆధార్-పాన్ లింకింగ్ కోసం రూ. ఏప్రిల్ 1, 2022 తర్వాత మొదటి మూడు నెలలకు 500 మరియు రుసుము, తర్వాత రూ. 1000 చెల్లించవలిసి ఉంటుంది.

మీ ఆధార్ కార్డ్‌ని మీ పాన్ కార్డ్‌కి లింక్ చేయడానికి ఈ సూచనలను పాటించండి?

ముందుగా incometaxindiaefiling.gov.in కి వెళ్లి, మీ వ్యక్తిగత సమాచారంతో రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించండి.

ఇప్పుడు లాగిన్ చేయడానికి మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.

రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం IRCTC కొత్త మార్గదర్శకాలు!

 

మీ పాన్‌ను మీ ఆధార్ నంబర్‌కి లింక్ చేయమని అభ్యర్థిస్తూ పాప్-అప్ విండో (pop up window) కనిపిస్తుంది.

లేనియెడల మెనూ బార్‌కి వెళ్లి, 'ప్రొఫైల్ సెట్టింగ్‌లు' (‘Profile Settings) ఎంచుకోండి, ఆపై 'ఆధార్‌ను లింక్ చేయండి.'

స్క్రీన్‌పై ఉన్న పాన్ సమాచారాన్ని మీ ఆధార్ కార్డ్‌తో సరిపోల్చండి.

మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత "లింక్ నౌ" (link now) బటన్‌ను క్లిక్ చేయండి.

తర్వాత మీ ఆధార్, పాన్‌కార్డు కి విజయవంతంగా లింక్ చేయబడిందని స్క్రీన్ పై పాప్-అప్ సందేశంవస్తుంది.

రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం IRCTC కొత్త మార్గదర్శకాలు!

Related Topics

Pancard

Share your comments

Subscribe Magazine

More on News

More