సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ,యాసంగి వడ్ల కొనుగోళ్లను మంగళవారం నుంచి ప్రారంభించాలని ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 7100 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించారు .
ఈ సందర్భంగా మంత్రులు మాట్లా డుతూ ధాన్యం నిల్వ చేసేందుకు ఇంటర్మీడి యట్ కాలేజీలను గోడౌన్లుగా గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని , స్టేట్ బోర్డర్లలో చెక్ పోస్టులు సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా స్టేట్ బోర్డర్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ,ధాన్యం కొనుగోళ్లకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు రెడీ చేసుకోవాలని కలెక్టర్లును సూచించారు . అమ్మిన వడ్ల డబ్బులు రైతులకు చెల్లించడంలో లేటు కాకుండా కొనుగోలు వివరాలను ఎప్పటికప్పడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణాలో వరిసాగు రికార్డు స్థాయికి చేరింది గతంలో ఎన్నడూ లేనివిదంగా ఇప్పటికి 57 లక్షల ఎకరాకు సాగు చేరుకుంది , వ్యవసాయ అధికారులు 50 లక్షలకు సాగు చేరుకుంటుందని అంచనాలు వేసినప్పటికీ ఆ అంచనాలను తలక్రిందులుచేస్తూ సాగు ఏకంగా 57లక్షలకు చేరుకుంది .
భారీగా పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఎగుమతులు.. ఎంత అంటే?
వరిసాగులో ఉమ్మడి నల్గొండ అగ్రగామిగా నిలిచింది , నల్గొండలో 5 . 4 లక్షల ఎకరాలో వరిసాగు జరగగా సూర్యాపేట లో 4 లక్షల ఎకరాలు , యాదాద్రి భువనగిరి 2 లక్షల ఎకరాలు , తరువాతి స్థానంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు నిలిచింది . మహబూబ్ నగర్ జిల్లా లో 3. 9 లక్షల ఎకరాలలో వరిసాగు జరుగగా తరువాతి స్థానంలో సిద్ధిపేటలో 3. 31 లక్షల ఎకరాలలో సాగు జరిగింది .
Share your comments