మనం నివసించే పరిసరాలను ,వాతావరణాన్ని బట్టి మనం తినే ఆహారం ఆధారపడి ఉంటుంది ఒక రాష్ట్రానికి తో పోలిస్తే మరొక రాష్ట్రము ఆహార నియమాలు ఆహారపు అలవాట్లు వేరుగా వుంటాయి . మన ఆహార సరళికి కాదని ఏది తిన్న ప్రమాదమే అలాంటి సంఘటన ఒడిస్సా రాష్ట్రము లో జరిగింది . ఇంట్లోకి పాలుమార్లు కప్ప రావడం గుర్తించిన వ్యక్తి తీసుకున్న విచిత్రమైన నిర్ణయం ద్వారా ఇంట్లో ఒకరు ప్రాణాలే కోల్పోయే పరిస్థితి దాపరించింది .
ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని బోడా బ్లాక్‌కు చెందిన మున్నాముండా అనే గిరిజనుడి ఇంట్లోకి ఓ కప్ప వచ్చింది. మున్నా దాన్ని వండి కూర చేశాడు. ఇంట్లో అందరూ తిన్నారు. మున్నా కూతురు ఆరేళ్ల సుమిత్ర ఆ కూరతో అనారోగ్యం బారినపడి చనిపోయింది.
మరో కూతురు నాలుగేళ్ల మున్నీ తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కప్ప కూర తిన్న పెద్దలకు ఏమీ కాలేదు. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ కావడం దుష్ప్రభావం చూపిందని అధికారులు చెప్పారు. కొన్ని రకాల కప్పల్లో శత్రువుల నుంచి రక్షించుకోడానికి విషం ఉంటుందని మున్నా కుటుంబం అలాంటి కప్పనే వండుకుని ఉంటుందని చెబుతున్నారు. కప్పల చర్మపై విషగ్రంధులు ఉంటాయని గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని వీఎస్‌ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ సంజీబ్ మిశ్రా తెలిపారు.
పెరగనున్న వంట నూనె ధరలు... కారణం ఇదే !
అందుకే మనవంటికి పడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి కొత్త పోకడలకు పోయి ఏదయినా కొత్త గ ప్రయత్నించాలి అని విచిత్ర నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుంది జాగ్రత్త .
Share your comments