రానున్న వాతావరణ పరిస్థితుల ప్రాధాన్యతను తెలియజేస్తూ మరోసారి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌కి వర్ష హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.
ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.. నేడు కూడా కురుస్తాయని తెలిపింది. ఈ ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలకు కారణమవుతుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లోని ఏజెన్సీ ప్రాంతం, శివారు ప్రాంతాల్లో చలి పులి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం లేదంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కారణం ఇదే.!
పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాలు పొగ, మంచు కమ్ముకోవడంతో స్థానికులు తెల్లవారుజాము వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిగ్ జామ్ తుఫాను తర్వాత ఈ శీతల వాతావరణం యొక్క తీవ్రత మరింత తీవ్రమైంది, దీని ఫలితంగా ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం క్షీణించాయి. ఇంకా, దట్టమైన పొగమంచు కారణంగా చలి గాలులు మరింత తీవ్రమవుతాయి, నివాసితులు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను పెంచుతాయి.
దట్టమైన పొగమంచు కారణంగా డ్రైవర్లు చిన్నపాటి ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉంది. మిగ్ జాం తుఫాను వల్ల పంట చేతికందే సమయానికి పొలంలోనే పాడైపోయిందని, పంట నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments