కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భీమా పథకంలో భాగంగా రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి ఐదు లక్షలు పరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది అక్రమార్కులు ఈసొమ్మును కొట్టేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపట్టిన రైతుబంధు పథకం అమలులో భాగంగా చంద్రమ్మ అనే మహిళ రైతు బతికుండగానే ఏడాదిక్రితమే చనిపోయినట్టు నకిలీ పత్రాలు సృష్టించి రైతు బీమా సోమ్మును కాజేసిన సంఘటన మరవకముందే మరో ఘటన వెలుగు చూడడంతో ఈ పథకం అమలులో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం మల్కాపూర్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మల్కాపూర్ గ్రామానికి చెందిన చాకలి కాశన్న అనే రైతుకు కొంత వ్యవసాయ భూమి ఉంది.అయితే వీరు వ్యవసాయ భూమిని ఇతరులకు అప్పగించి ఆర్థిక కారణాల దృష్ట్యా హైదరాబాదులో తన కొడుకు రాములుతో కలిసి జీవిస్తున్నాడు.అయితే కాశన్న కొద్ది రోజుల క్రితమే కనిపించకుండా పోయాడు. ఆయన ఇంటికి రాకపోవడంతో కొడుకు రాములు రైతు బంధు డబ్బుల కోసం తండ్రి కరోనాతో మరణించాడని గ్రామ పంచాయితీ ఆఫీస్ నుంచి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించి తన తండ్రి రైతు బీమా సొమ్ము కోసం అప్లై చేసుకున్నాడు.
ఇంతవరకు బాగానే ఉంది ఇటీవలే రైతు బీమా సొమ్ము కాజేసిన ఘటన వెలుగు చూడడంతో అప్రమత్తమైన అధికారులు రైతు బంధు దరఖాస్తులపై విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. కాశన్న కుమారుడు రాములు అసలు విషయం దాచి అధికారులను మోసం చేసి మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు గుర్తించి స్థానిక ఎంపీడివోకు ఫిర్యాదు చేశారు. దీని పై సీరియస్ అయిన అధికారులు రాములపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Share your comments