దేశంలో ప్రతినెల కూడా నియమాలు అనేవి మారుతూనే ఉంటాయి. ఇప్పటికే అక్టోబర్ నెల ప్రారంభమైంది. ఈ నెలలో కూడా చాలా మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులనేవి ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై అధిక GST నుండి డెబిట్-క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ ను ఎంచుకునే సౌలభ్యం వరకు అనేక వాటిలో ఏఈ మార్పులు జరగనున్నాయి. కొన్ని మార్పులు అదనపు ఆర్థిక బాధ్యతలకు దారితీయవచ్చని, మరికొన్ని ప్రయోజనకరమైన ఫలితాలను తీసుకురావచ్చని అనుకోవచ్చు.
అక్టోబర్ 1 నుండి, క్రెడిట్, డెబిట్ లేదా ప్రీపెయిడ్ కార్డ్‌లను కలిగి ఉన్న వ్యక్తులందరికీ వారి కార్డ్ నెట్‌వర్క్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ఒకరి మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌ని మార్చడం లాంటిది. కొత్త నిబంధన ప్రకారం, వీసా కార్డులను కలిగి ఉన్న వ్యక్తులు కొత్త ఖాతాలను తెరవాల్సిన అవసరం లేకుండానే మాస్టర్ కార్డ్ లేదా రూపే వంటి ఇతర నెట్‌వర్క్‌లకు మారే విలుంటుంది.
ఇలా మారడం వల్ల వ్యక్తి యొక్క క్రెడిట్ చరిత్రపై ఎటువంటి ప్రభావం చూపదు. ఈ మార్పు వ్యక్తులు తమ ప్రాధాన్యతలకు బాగా సరిపోయే కార్డ్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవడానికి వారికి అధికారం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు తమ కార్డ్ హోల్డర్‌లకు ఈ నెట్‌వర్క్ మారడానికి ఎంపికను అందిస్తాయి. ప్రస్తుతం, భారతదేశంలో ఐదు కార్డ్ నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి, అవి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్, మాస్టర్ కార్డ్ ఆసియా, NPCI-Rupay మరియు Visa Worldwide Pte Ltd.
ఇది కూడా చదవండి..
నేడు జైల్లో చంద్రబాబు నిరాహారదీక్ష.. అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన
కేంద్రం ప్రవేశపెట్టిన 2023 జనన మరియు మరణాల నమోదు చట్టం అక్టోబర్ 1, 2023 నుండి అమలులోకి వచ్చింది. ఈ విషయంపై కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ చట్టం అమల్లోకి రావడంతో, ఆధార్ కార్డు పొందడం, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడం, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు కోరడం, పాస్‌పోర్ట్ పొందడం, అలాగే వివాహాలు మరియు జననాలను నమోదు చేయడం వంటి వివిధ అధికారిక ప్రక్రియలకు ఇకపై బర్త్ సర్టిఫికెట్ ఒక్కటే అందిస్తే సరిపోతుంది.
దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు PPF, NSC, సుకన్య సమృద్ధి వంటి చిన్న పథకాలలో పెట్టుబడి పెడుతున్నారు. ఈ పొదుపు పథకాల ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి.. ఖాతాదారులు తమ పాన్, ఆధార్ వివరాలను సెప్టెంబర్ 30లోగా అందించడం తప్పనిసరి. అలా చేయని వారి ఖాతాలను అక్టోబర్ 1 తర్వాత సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఖాతాదారులు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీసు బ్రాంచ్ నుండి దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీని అక్టోబర్ 1 నుంచి విధించనున్నారు. చాలా వాహనాల తయారీ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇందులో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల తయారీ కంపెనీలు కూడా ఉన్నాయి. ధరలపెరుగుదల వాహనం యొక్క మోడల్ ప్రకారం మారుతూ ఉంటుంది.
ఇది కూడా చదవండి..
Share your comments