PM KISAN:పీఎం కిసాన్ యోజన 11వ విడతను ప్రధాని మోదీ నిన్నటి రోజున విడుదల చేసిన సంగతి విదితమే.
"PM Kisan Samman Nidhi Yojana: PM కిసాన్ యోజన 11వ విడత మీ ఖాతాలోకి రాకపోతే, చింతించకండి. డబ్బు జమ అవ్వాలంటే ఏం చేయాలో ఇక్కడా తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 11వ విడతను 31 మే 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. పిఎం కిసాన్ యోజన కింద, ప్రభుత్వం అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి రూ. 2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
11వ విడత కింద PM కిసాన్ లబ్ధిదారులలో చాలా మంది ఇప్పటికే రూ. 2000 లబ్ది పొందారు. అయితే వారి ఖాతాలో డబ్బులు రాని వారు చాలా తక్కువ, అందులో మీరు కనుక ఉంటె ఆందోళన చెందకండి.
PM Kisan Status: PM కిసాన్ 11వ విడత రూ.2000 అందని రైతులు ఈ నంబర్‌లకు కాల్ చేయండి:
PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్:155261, 011-24300606, 0120-6025109
PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011-23381092, 23382401
అంతే కాకుండా మెయిల్ ద్వారా pmkisan-ict@gov.in కి మీ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.
చెల్లింపు ఆలస్యం అవడానికి గల కారణాలు:
అత్యంత సాధారణంగా జరిగే పొరపాటు ఏమిటంటే ఆధార్ కార్డ్,మరియు బ్యాంక్ ఖాతా నంబర్‌ను తప్పుగా నమోదు చేయడం, మీరు కూడా ఇలా చేసి ఉంటే మీకు డబ్బు రాదని గుర్తుంచుకోండి.PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఈ తప్పులను సరిదిద్దుకోవచ్చు.
మరిన్ని చదవండి.
Share your comments