News

NITI AAYOG:వినూత్న వ్యవసాయంపై సదస్సు నిర్వహించనున్న నీతి ఆయోగ్

S Vinay
S Vinay

ఏప్రిల్ 25, 2022న, NITI ఆయోగ్ ఆజాదికా అమృత్ మహోత్సవ్‌లో భాగంలో వినూత్న వ్యవసాయం పై(Innovative Agriculture)జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తుంది.

సహజ వ్యవసాయం అనేది వ్యవసాయ పద్ధతులు సహజ చట్టాల ద్వారా మార్గనిర్దేశం చేసే పద్ధతి. నీతి ఆయోగ్ ఏప్రిల్ 25న వర్క్‌షాప్‌లో ఈ అంశంపై ప్రసంగించనుంది.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పర్షోత్తమ్ రూపాలా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, డాక్టర్ రాజీవ్ కుమార్, సభ్యుడు (వ్యవసాయం) డాక్టర్ రమేష్ చంద్, సీఈఓ అమితాబ్ కాంత్ పాల్గొననున్నారు

ప్రపంచ నలు మూలల నుండి వినూత్న వ్యవసాయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులలో పాలుపంచుకుంటున్న అందరిని ఈ కార్యక్రమం ఒకచోట చేర్చుతుందని భావిస్తున్నారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నేల ఆరోగ్య పునరుద్ధరణలో దాని పాత్ర మరియు వాతావరణ మార్పుల ఉపశమనానికి సంబంధించిన కీలకమైన అంశాలపై చర్చలు జరుగుతాయి.

సహజ వ్యవసాయంపై ప్రధాన దృష్టి
సహజ వ్యవసాయ పద్ధతులు ప్రధానంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క వ్యవసాయ పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి. రసాయనిక వ్యవసాయం యొక్క ప్రతికూల ప్రభావాలను పర్యవరణం పై తగ్గించడంతోపాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి ఇది రైతులకు సాధ్యమయ్యే సూచనలను అందిస్తుంది.

గౌరవనీయులైన ప్రధాన మంత్రి వివిధ సందర్భాలలో సహజ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.ఇంతకు ముందే సహజ వ్యవసాయంపై జరిగిన జాతీయ సమ్మేళనం సందర్భంగా, సహజ వ్యవసాయాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన కోరిన సంగతి తెలిసిన విషయమే

2022–23 కేంద్ర బడ్జెట్ లో సహజ వ్యవసాయాన్ని ప్రస్తావిస్తూ గంగా నది పొడవునా 5-కిమీ వెడల్పు గల కారిడార్‌లోని పొలాలలో సహజ వ్యవసాయాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రకటించింది.

మరిన్ని చదవండి.

సేంద్రీయ వ్యవసాయంపై 30 రోజుల సర్టిఫికేట్ శిక్షణా కోర్సు!

Related Topics

NITI Aayog NATURAL FARMING

Share your comments

Subscribe Magazine

More on News

More