రైతుబంధు పథకం కింద కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు పెట్టుబడి సాయం గ అందిస్తున్న రైతు బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి డి ఏ ఓ(DAO ) అనురాధ కృషి జాగరణ్ మీడియా ప్రతినిధి తో జరిపిన ఫోన్ సంభాషణలో తెలిపారు .
వానాకాలం సీజన్ కోసం రైతు బంధు పెట్టుబడి సాయం కోసం కొత్త గ పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత మండల విస్తరణ అధికారుల వద్ద దరఖాస్తులు చేసుకోవాలని ,దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఇంకా నిర్ణయించబడలేదని అయితే రైతులు మాత్రం ఆలస్యం చేయకుండా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు .
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :
- పట్టాదార్ పాస్ పుస్తకం
- ఆధార్‌కార్డు
బ్యాంక్ ఖాతా పాస్‌పుస్తకం జిరాక్స్ కాపీలు తీసుకొని పని దినాలలో దరఖాస్తు చేసుకోవాలి . -
రైతుల ఆశలన్నీరుణ'మాఫీ'పైనే.. ఎన్నికల ముందు అయిన రుణమాఫీ జరిగేనా ?
రైతుబంధు పథకం :
రైతుబంధు పథకాన్ని మే 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గత మూడేళ్లుగా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు సహాయం చేయడానికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద రైతులకు పంట సీజన్‌కు ఎకరానికి రూ.5,000 నగదు పెట్టుబడి సాయంగా అందిస్తుంది.
Share your comments